గత ఏడాదే సమంతా నుండి సమంతా అక్కినేని గా మారిన సంగతి అందరికి తెలిసిందే.
ఇక ఆమె ఎంత గొప్ప నటో అంతకన్నా గొప్ప మనిషి అన్న విషయం ఆమె చేసే కార్యక్రమాలు బట్టి తెలుస్తుంది. ఇప్పటికే ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చిన్న పిల్లలకి, ఆడవారికి ఎన్నో రకాల సహాయం చేస్తున్నది. ఇదిలావుండగా తన పెళ్ళికి, రిసెప్షన్ కి వచ్చిన బహుమతుల్ని వేలం వేసి దాని ద్వారా వచ్చే ఆదాయంతో సామాజిక కార్యక్రమాలు చేయబోతున్నట్టు తెలిసింది.
దీనికి సంబంధించి ఇప్పటికే ఆమె భర్త నాగ చైతన్య, మామ నాగార్జున, అత్త అమల దగ్గర నుండి పూర్తి సహకారాన్ని ఆమెకి ఉన్నట్టు సమాచారం. ఈ విషయం తెలిసిన వారంతా సమంతా రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరోయిన్ అని అందరు ఆమెని పొగుడుతున్నారు.
ఇక ఈ వేలంపాట త్వరలోనే జరగనున్నట్టు తెలుస్తున్నది అలాగే దీనికి సంబందించిన ప్రకటనని ఆమె స్వయంగా చేయబోతున్నట్టు తెలిసింది. సామ్ ప్రస్తుతం తమిళంలో విశాల సరసన ఒక చిత్రంలో నటిస్తున్నది.