నగరాలలో రోడ్డు ప్రమాదాల నివారణకి ట్రాఫిక్ పోలీసులు ప్రతిరోజు రాత్రి డ్రంక్ & డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇది దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాలలో చేపడుతున్నారు.
అందులో భాగంగానే నిన్న చెన్నైలో అక్కడి పోలీసులు డ్రంక్ & డ్రైవ్ నిర్వహించగా, ప్రముఖ దర్శకుడి కొడుకు స్వయంగా హీరో అయిన మనోజ్ కే భారతీరాజా వాహనం తాగి నడుపుతూ పోలీసులకి దొరికిపోయాడు. తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు వారు ఈయనకి కూడా బ్రీత్ అనలైజ్ పరీక్ష చేయడంతో ఆయన మధ్య తాగినట్టుగా వచ్చింది.
వెంటనే సదరు కారుని సీజ్ చేసి, రూ 2500/- జరిమానా కూడా విధించినట్టుగా సమాచారం. అయితే ఆయనని కౌన్సిలింగ్ కి పిలిచే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. ఇక ఈ మధ్యనే తమిళ హీరో జై కూడా ఇలా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించి పోలీసులకి చిక్కాడు.
మొత్తానికి ఇలా డ్రంక్ & డ్రైవ్ లలో చాలామంది సెలబ్రిటీలు దొరుకుతుండడం గమనార్హం.