నిన్న ప్రసారమయిన ఒక పాపులర్ టాక్ షోలో పాల్గొన్న రేణు దేశాయ్ తన మాజీ భర్తకి సంబంధించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
తాము ఇప్పటికి మంచి స్నేహితులుగానే మెలుగుతున్నామని అలాగే చాలా మంది అనుకుంటున్నట్టుగా తాను పవన్ నుండి విడిపోయే సమయంలో ‘భరణం’గా పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నాను అన్నది అవాస్తవం అని తేల్చి చెప్పింది.
ఇక తాను పవన్ తో కలిసి జీవించడం ప్రారంబించాక ఆయన సినిమాలకి, ప్రొడక్షన్ కి పని చేసిన సమయంలో నాకు న్యాయంగా రావాల్సిన డబ్బునే తీసుకున్నట్టు అలాగే తాను రియల్ ఎస్టేట్ లో డబ్బుని ఇన్వెస్ట్ చేయడంతో ఆ డబ్బుని మాత్రమే తీసుకున్నాను అని చెప్పింది.
అంతేతప్ప తాను ఏ విధమైన ‘భరణాన్ని’ ఆశించలేదు అని అలాగే డబ్బు కోసమే ఆయన నుండి విడిపోలేదు అని క్లారిటీ ఇచ్చేసింది. ఇక తామెందుకు విడిపోయామో అన్నది తన ఆత్మకథలోనే తెలుస్తుంది అని చెప్పుకొచ్చింది.