ప్రాంతీయ అజెండా వున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) లో తాను కొనసాగలేనని, ఇలాంటి ఐడియాలజీ వున్న సంఘంతో పనిచేయలేనని, అందుకే మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాని ప్రకటించారు ప్రకాశ్‌రాజ్. ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘తెలుగు వ్యక్తి కాని వాడు ఓటు వేయవచ్చు. కానీ ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నినాదాన్ని తెరపైకి తెచ్చారు.
తెలుగుబిడ్డ, మంచి, మంచు బిడ్డనే ఎన్నుకున్నారు. దాన్ని నేను స్వాగతిస్తున్నా'' అని చెప్పుకొచ్చారు ‘‘ఒక కళాకారుడిగా నాకంటూ ఆత్మగౌరవం ఉంటుంది. అందువల్ల ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నా. ఇది బాధతో తీసుకున్న నిర్ణయం కాదు. ప్రేక్షకులకు నాకూ ఉన్న బంధం సినిమాలతో కొనసాగుతుంది. వచ్చే రోజుల్లో నేను అతిథిగా ఉండాలంటే అసోసియేషన్ మెంబర్‌గా ఉండకూడదు.
తెలుగువాడిగా పుట్టకపోవడం తన దురదృష్టకరమన్నారు. అతిథిగా వచ్చానని, అతిథిగానే ఉంటా'' ప్రకటించారు.