తమిళంలో ధనుష్ నటించిన ఓ సినిమా ని తెలుగులో వెంకటేష్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అదే `నారప్ప`. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ప్రియమణి కథానాయిక. ఎప్పుడో పూర్తయిపోయిన సినిమా ఇది. మేలో విడుదలకావాల్సివుంది. అయితే.. ఈ సినిమా మేలో రావడం లేదని తెలుస్తోంది. కోవిడ్ కారణంగా ఈసినిమాని విడుదల చేయడానికి నిర్మాత సురేష్‌బాబు ధైర్యం చేయలేకపోతున్నాడు. అయితే మరో కారణం కూడా ఉంది. ఈ సినిమా రషెష్ చూసిన సురేష్ బాబు, కొన్ని కీలకమైన మార్పులు సూచించినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం చిత్రబృందం ఆ పనిలో ఉందని, ఈ సినిమాకి రీషూట్లు జరుగుతున్నాయని, అందుకే అనుకున్న సమయానికి విడుదల కావడం లేదని సమాచారం. అయితే.. `నారప్ప` కంటే `దృశ్యమ్ 2` చాలా ఆలస్యంగా మొదలైంది. ఇప్పుడు అదే ముందు విడుదల కావొచ్చట. దృశ్యమ్ 2 రీమేక్ పనులు చకచక సాగుతున్నాయి. షూటింగ్ కూడా దాదాపుగా పూర్తి కావొచ్చిందట. జూన్ లో ఈ సినిమా విడుదల చేయొచ్చని తెలుస్తోంది. ఆ తరవాతే.. నారప్ప వస్తుందట.