'మా' రభస ఇప్పట్లో చల్లారేట్టు లేదు. అది రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. `మా` కొత్త అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేసే లోగా మరో ట్విస్టు వచ్చే అవకాశాలు, సూచనలు కనిపిస్తూనే ఉన్నాయి. మా ఎన్నికలు జరిగిన రోజున... సీసీ కెమెరాలో రికార్డయిన ఫుటేజీని ఇవ్వాల్సిందిగా ఎన్నికల సంఘానికి ప్రకాష్ రాజ్ లేఖ రాశారు. ఫుటేజీ కోరడం మా హక్కు అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు ప్రకాష్ రాజ్. మా ఎన్నికలు జరిగిన రోజున పోలింగ్ క్యాంపస్ లో చాలా గొడవలే జరిగాయి.
పోలింగ్ లో సైతం అవకతవకలు జరిగాయని, పోస్టల్ బ్యాలెట్లు ఇంటికి పట్టుకెళ్లిపోయారని విమర్శలు వినిపించాయి. వీటిపై నిగ్గు తేల్చేందుకే ప్రకాష్ రాజ్ సీసీ కెమెరా ఫుటేజీ అడిగినట్టు తెలుస్తోంది. ఈ ఫుటేజీని కోర్టులో సబ్మిట్ చేసి, `మా` ఎన్నికలు, రిజల్ట్ పై స్టే తీసుకొచ్చే అవకాశాలున్నాయని సమాచారం. టాలీవుడ్ లో పేరొందిన న్యాయవాది నిరంజన్ రెడ్డి ద్వారా ఈ కేసు ఫైల్ చేయబోతున్నారట.
నిరంజన్ టేకప్ చేసిన ఏ కేసూ ఓడిపోలేదు. ఆయన ఫేమస్ లాయర్. అందుకే... ఈ కేసు కూడా గెలుస్తానమన్న నమ్మకంతో ప్రకాష్ రాజ్ ఉన్నారు. సోమవారం కేసు ఫైల్ చేసే అవకాశం ఉంది. మరి... ఆ తరవాత ఏం జరుగుతుందో? ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.