బాపూబొమ్మట బౌన్స్‌ బ్యాక్‌ అవుతుందట.!

By iQlikMovies - October 17, 2018 - 15:42 PM IST

మరిన్ని వార్తలు

'ఏం పిల్లో ఏం పిల్లడో' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ బ్యూటీ ప్రణీత. తనీష్‌ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఆమెకి పెద్దగా పేరు తెచ్చిపెట్టింది లేదు కానీ, ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినా, కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమా అంటే 'అత్తారింటికి దారేది' మాత్రమే. నిజానికి ఎన్టీఆర్‌, మహేష్‌ తదితర స్టార్‌ హీరోలతోనూ సినిమాలు చేసింది. కానీ చెప్పుకోదగ్గ ఫేమ్‌ రాలేదు ఈ ముద్దుగుమ్మకి. 

'అత్తారింటికి దారేది' చిత్రంలో 'అమ్మో బాపూగారి బొమ్మో..' అంటూ పవన్‌ కళ్యాణ్‌ చేత తెగ పొగిడించేసుకుంది కానీ, ఆ పొగడ్తలు ఆమె కెరీర్‌కి పెద్దగా పనికొచ్చింది లేదు. చాలా సినిమాల్లో హీరోయిన్‌తో ఈక్వెల్‌ వెయిట్‌ ఉన్న పాత్రలు దక్కినా, ఎక్కడో చోట మధ్యలో వదిలేసే పాత్రలే ఆమెకు ఎక్కువ. దాంతో పూర్తి స్థాయి హీరోయిన్‌గా పేరు తెచ్చుకోలేకపోయింది. మంచు విష్ణు, మంచు మనోజ్‌ తదితర యంగ్‌ హీరోస్‌తోనూ సోలో హీరోయిన్‌గానూ నటించింది ప్రణీత. మహేష్‌బాబుతో 'బ్రహ్మూెత్సవం' సినిమా తర్వాత ప్రణీత చాలా గ్యాప్‌ తీసుకుంది. మళ్లీ ఇప్పుడే ఓ సినిమాలో తళుక్కున మెరవబోతోంది. అదే 'హలో గురూ ప్రేమ కోసమే'. 

రామ్‌ - అనుపమా పరమేశ్వరన్‌ జంటగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రణీత ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తోంది. రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది 'హలో గురూ'. సరిగ్గా ఈ సినిమా రిలీజ్‌కి ఒక్కరోజు ముందు అంటే ఈ రోజు ప్రణీత తన పుట్టినరోజు పండుగను వేడుకగా జరుపుకుంటోంది. ఆమె నటించిన 'హలో గురూ..' మంచి సక్సెస్‌ని తెచ్చి పెట్టాలని ఆశిస్తూ, మనం కూడా ఈ బాపూ బొమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేద్దామా. 

హ్యాపీ బర్త్‌డే టు యు ప్రణీత.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS