వెండితెర 'బసవతారకం' ఏం చూస్తున్నట్టు.!

By iQlikMovies - October 17, 2018 - 15:30 PM IST

మరిన్ని వార్తలు

తెలుగులో నటించాలనే కోరిక ఇన్నాళ్లకు తీర్చుకుంది బాలీవుడ్‌ భామ విద్యాబాలన్‌. దక్షిణాది అమ్మాయే అయినా బాలీవుడ్‌లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి అక్కడే స్ధిరపడిపోయింది. ఆమె కెరీర్‌లో 'డర్టీ పిక్చర్‌' ది బెస్ట్‌ ఫిలిమ్‌. స్టార్‌ హీరో సినిమాలకు ధీటుగా ఈ సినిమా వసూళ్లు అందుకుంది అప్పట్లో. 

చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న విద్యాబాలన్‌ 'ఎన్టీఆర్‌' బయోపిక్‌లో ఆఫర్‌ రావడంతోనే ఎగిరి గంతేసింది. ఒక ప్రతిష్ఠాత్మక సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది మరి. స్వర్గీయ నందమూరి తారకరామారావు భార్య, స్వర్గీయ బసవతారకం పాత్రలో కనిపించనున్న విద్యాబాలన్‌ ఆ గెటప్‌ని ఇలా రివీల్‌ చేసింది. 'నేను ఏం చూస్తున్నాను..'? అని పేర్కొంటూ ఫోటో రిలీజ్‌ చేసింది. 

క్రిష్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి మొదటి పార్ట్‌ 'ఎన్టీఆర్‌ - కథానాయకుడు' విడుదలవుతుండగా, రెండో పార్ట్‌ 'మహానాయకుడు'ని రిపబ్లిక్‌డే సందర్భంగా విడుదల చేయనున్నారు. నందమూరి బాలయ్య నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రమిది.

శ్రీదేవి పాత్రలో రకుల్‌ ప్రీత్‌సింగ్‌, చంద్రబాబు పాత్రలో రానా, అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో సుమంత్‌, హరికృష్ణ పాత్రలో కళ్యాణ్‌రామ్‌ నటిస్తుండగా, స్వర్గీయ ఎన్టీఆర్‌ పాత్రని ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ పోషిస్తున్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS