ఎన్టీఆర్ ని 20 ఏళ్లుగా అభిమానిస్తున్నా: ప్రశాంత్ నీల్
‘కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆయన ‘కేజీఎఫ్-2’ విడుదలకు సిద్దమైయింది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే ఇద్దరు తెలుగు స్టార్ హీరోలతో సినిమా చేసే ఛాన్స్ అనుకున్నాడు నీల్ . ప్రభాస్ తో చేస్తున్న సలార్ సెట్స్ పై వుంది. ఎన్టీఆర్ తో కూడా సినిమా ఖరారైయింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఎన్టీఆర్ సినిమా గురించి మాట్లాడారు ప్రశాంత్ నీల్. ''20 ఏళ్లుగా ఎన్టీఆర్ కు అభిమానినని.స్క్రిఫ్ట్ వర్క్ ప్రారంభించడానికి ముందు ఓ పదిసార్లు తారక్‌ను కలిశా. ఎన్టీఆర్‌తో ప్రయాణం అద్భుతంగా వుంటుంది. ప్రయాణంలో తాము సన్నిహిత మిత్రులుగా మారం'' అని చెప్పుకొచ్చాడు ప్రశాంత్. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. వచ్చే ఏడాది వేసవిలో ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమా విడుదల చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్దమౌతున్నారు.