మహేష్ బాబు, ఎన్టీఆర్.. టాలీవుడ్‌లో టాప్ హీరోలు. వీళ్లతో పనిచేయాలని ప్రతీ దర్శకుడు కలలు కంటారు. ఒక్క ఫోన్ చేస్తే చాలు.. కథలు కట్టుకుని వాలిపోతారు. అయితే ఈ హీరోలిద్దరూ ఓ దర్శకుడి కోసం పడిగాపులు కాస్తున్నారు. `ముందు నాతో చేయ్` అంటే `ముందు నాతోనే చేయ్` అంటూపోటీ పడుతున్నారు. ఆ దర్శకుడెవరో కాదు. ప్రశాంత్‌నీల్. ప్రశాంత్ నీల్.. `కేజీఎఫ్`తో ఈ పేరు మార్మోగిపోయింది.
ఈ కన్నడ చిత్రం బాలీవుడ్ సినిమాలకు ధీటుగా మంచి వసూళ్లు అందుకోవడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. కేజీఎఫ్‌తో ప్రశాంత్‌నీల్ గ్రాఫే మారిపోయింది. ప్రశాంత్ తో సినిమా చేయడానికి హీరోలంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే `కేజీఎఫ్ ఛాప్టర్ 2`తో ప్రశాంత్ బిజీగా ఉండడం వల్ల మరెవరికీ ఓకే చెప్పలేకపోయాడు ప్రశాంత్. అయితే ఈలోగా ఎన్టీఆర్ - ప్రశాంత్ కాంబో ఖాయమైపోయింది. ఈ కాంబినేషన్లో మైత్రీ మూవీస్ ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యింది. ఇప్పుడు మహేష్ కూడా కర్చీఫ్‌వేసేశాడు. మహేష్ బాబుతో ప్రశాంత్ నీల్ ఓ సినిమా చేయబోతున్నాడని టాలీవుడ్ టాక్.
కేజీఎఫ్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రశాంత్ మహేష్‌ని కలుసుకుని ఓ కథ చెప్పినట్టు తెలుస్తోంది. దానికి మహేష్ కూడా ఓకే అనేశాడట. మరి ముందు ఎన్టీఆర్ సినిమాప్రారంభం అవుతుందా? మహేష్ సినిమా పట్టాలెక్కుతుందా? అనేది తెలియాల్సివుంది. అయితే ఈ ఇద్దరు హీరోలు మాత్రం `నాతోనే ముందు` అంటూ ఈ దర్శకుడిపై ఒత్తిడి తెస్తున్నట్టు టాక్. మరి ఏం జరుగుతుందో చూడాలి.