అ.. సినిమాతో ఆకట్టుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఆ తరవాత కల్కితోనూ తనదైన మార్క్ వేశాడు. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా కరోనా నేపథ్యంలో సాగబోతుండడం విశేషం. కరోనా నేపథ్యంలో రాంగోపాల్ వర్మ ఇప్పటికే ఓ సినిమా మొదలెట్టాడు. ఇప్పుడు ప్రశాంత్ వర్మ వంతు వచ్చింది. ఈరోజు మోషన్ పోస్టర్ కూడా విడుదల చేశాడు.
కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు ప్రశాంత్ వర్మ చెబుతున్నాడు. మోషన్ పోస్టర్ చూస్తుంటే... ఇది కర్నూల్ బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమా అని స్పష్టంగా అర్థమవుతోంది. ఆంధ్ర ప్రదేశ్‌లో కర్నూలులో కరోనా కలకలం రేగింది. అక్కడ ఎక్కువ కేసులు నమోదు కావడంతో రెడ్ జోన్‌గా ప్రకటించింది ప్రభుత్వం. వాటి చుట్టూనే ప్రశాంత్ వర్మ కథ సాగుతుందేమో చూడాలి. త్వరలోనే ఈ సినిమా టైటిల్‌ని ప్రకటిస్తారు.
— Prasanth Varma 4.0 (@PrasanthVarma) May 29, 2020