మెగా మేనల్లుడికిది అసలు సిసలు పండగే.!

By Inkmantra - January 04, 2020 - 07:30 AM IST

మరిన్ని వార్తలు

'ప్రతిరోజూ పండగే' అంటూ క్యాచీ టైటిల్‌ పెట్టుకుని ఇయర్‌ ఎండింగ్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చిన మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టి, సత్తా చాటాడు. అంతకు ముందే విడుదలైన 'వెంకీ మామ' ఈ సినిమాకి పోటీగా నిలబడినా, కలెక్షన్స్‌ పరంగా సాయి తేజ్‌ భళా అనిపిస్తున్నాడు. తొలిసారి 30 కోట్ల మార్కెట్‌ని సొంతం చేసుకున్నాడు తేజు ఈ సినిమాతో. 30 కోట్ల పైగానే ఈ సినిమాకి కలెక్షన్లు దక్కాయని ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక న్యూ ఇయర్‌ సందర్భంగా ఈ వారం ప్రేక్షకుల ముందుకొచ్చిన 'బ్యూటిఫుల్‌' తదితర చిన్న చిత్రాలేమీ బాక్సాఫీస్‌ వద్ద నిలదొక్కుకోలేకపోయాయి. దాంతో ఈ వారం కూడా 'ప్రతిరోజూ పండగే'వే కలెక్షన్లు.. అంటున్నారు.

 

ఈ నెల 9న రజనీకాంత్‌ 'దర్బార్‌' విడుదల కానుంది. అంతవరకూ పండగ తేజుదే మరి. 'భలే భలే మగాడివోయ్‌' సినిమా తర్వాత దర్శకుడు మారుతికి కూడా ఈ సినిమాతోనే అసలు హిట్‌ దక్కిందనాలేమో. ఇక వరుస ఫెయిల్యూర్స్‌లో ఉన్న తేజుకి, 'చిత్రలహరి'తో కాస్త ఊపిరి పీల్చుకున్నట్లయినా, 'ప్రతిరోజూ పండగే'తో అసలు సిసలు నిఖార్సయిన హిట్‌ సొంతమైంది. దీంతో టోటల్‌గా తేజు కెరీర్‌ గాడిన పడిపోయినట్లే. మరి, ఈ జోరు తదుపరి కూడా తేజు కంటిన్యూ చేయాలని ఆశిద్దాం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS