పండక్కి సూట్‌కేస్ ప్యాక్ చేసుకుని ఎంట్రీ ఇచ్చేశాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. ఏం పండక్కి దసరా అయిపోయింది కదా అనుకుంటున్నారా.? దీపావళి ఉంది కదండీ.. క్రిస్‌మస్ కూడా ఉంది. అన్నింటికన్నా ముందు ఈ రోజు ఆయన పుట్టినరోజు పండగ ఉందండీ. అందుకే ఇలా దర్శనమిచ్చాడు. సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా, 'ప్రతిరోజూ పండగే' టీమ్ తాజాగా ఓ పోస్టర్‌ని వదిలి, గ్రాండ్‌గా మెగా మేనల్లుడికి బర్త్‌డే విషెస్ చెప్పింది. ఈ లుక్‌లో చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు మన సుప్రీమ్ హీరో.
మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా క్రిస్‌మస్ కానుకగా డిశంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది. పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించేలా మారుతి మార్క్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. సాయి ధరమ్ తేజుకి జోడీగా రాశీఖన్నా నటిస్తోన్న ఈ సినిమాలో సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మరోవైపు తేజు తదుపరి చిత్రం కూడా లైన్‌లో పెట్టేశాడు.
లేటెస్ట్‌గా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. నవంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ ఏడాది ఆల్రెడీ 'చిత్రలహరి'తో ఓ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న తేజు, 'ప్రతిరోజూ పండగే'తో మరో హిట్‌ని సొంతం చేసుకోవాలని ఆశిస్తూ, ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తేజుకి మనం కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేద్దామా. హ్యాపీ బర్త్‌డే టూ యూ తేజు.