'ప్రతిరోజూ పండగే' ఫస్ట్ లుక్ కు అద్భుతమైన స్పందన.

By iQlikMovies - September 12, 2019 - 16:00 PM IST

మరిన్ని వార్తలు

ఇటీవలే చిత్రలహరి చిత్రంతో మంచి విజయం అందుకొన్న సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా.... భలే భలే మగాడివోయ్, మహానుభావుడు వంటి బంపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మారుతి దర్శకుడిగా, ఎన్నో ఇండస్ట్రీ హిట్ చిత్రాల్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, వంద కోట్ల క్లబ్ లో చేరిన గీత గోవందం వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన బన్నీ వాస్ నిర్మాతగా అందం అభినయంతో మెప్పిస్తున్న గ్లామర్ డాల్ రాశి ఖన్నా హీరోయిన్ గా రూపొందిస్తున్న భారీ చిత్రం "ప్రతిరోజు పండగే" ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం నానక్ రామ్ గూడ రామానాయుడు స్టూడియోలో జరుగుతోంది.

 

ఇటీవలే రిలీజ్ చేసిన ఈ చిత్రం ప్రీ లుక్ పోస్టర్ అందరి అటెన్షన్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు విడుదల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన లభించింది. హీరో సాయి తేజ్, సీనియర్ నటుడు సత్యరాజ్ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తో మనసుల్ని చూరగొన్నారు. సాయి ధరమ్ తేజ్ , సత్యరాజ్ ల కాంబినేషన్ లో విడుదల చేసిన పోస్టర్ వారి మధ్య అనుబంధాన్ని దర్శకుడు మారుతి అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ పోస్టర్ ద్వారా భావోద్వేగంతో కూడిన అందమైన కుటుంబ కథా చిత్రంగా ప్రతిబింబించారు. దర్శకుడు మారుతి... హీరో సాయి తేజ్ ను కొత్త రకమైన పాత్ర చిత్రణతో, న్యూ లుక్ లో చూపించబోతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కుటుంబ బంధాల్ని, విలువల్ని ఎమోషనల్ గా చిత్రీకరించనున్నారు. మారుతి చిత్రాల్లో సహజంగా కనిపించే ఎంటర్ టైన్ మెంట్ ఇందులో రెండు రెట్లు ఎక్కువగానే ఉండబోతుంది.

 

GA2UV పిక్చర్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని గ్రాండియర్ గా నిర్మిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత శ్రీ అల్లు అర‌వింద్ గారి సమర్పణలో, నిర్మాత‌ బ‌న్నీవాస్ సార‌ధ్యంలో ఈ చిత్రం నిర్మాణం జరుగుతోంది. సాయితేజ్, మారుతి కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న ప్ర‌తిరోజూ పండుగే చిత్రంపై భారీగా అంచనాలు ఏర్ప‌డ్డాయి. సుప్రీమ్ హీరో సాయి తేజ్, ఢిల్లీ బ్యూటీ రాశీ ఖ‌న్నా సుప్రీమ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత మరోసారి కలిసి నటిస్తున్నారు. క‌ట్ట‌ప్ప‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కి మరింత చేరువైన ప్ర‌ముఖ న‌టులు స‌త్య‌రాజ్ క్యారెక్ట‌ర్ ని ఈ సినిమా ద‌ర్శ‌కులు మారుతి ప్ర‌త్యేకంగా డిజైన్ చేశారు. అలానే ఈ సినిమాలో న‌టిస్తున్న మ‌రో న‌టుడు రావు ర‌మేశ్ పాత్ర కూడా హైలెట్ గా ఉండ‌నుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS