'ప్రతి రోజూ పండగే' సినిమా నుండి మెగా మేనల్లుడు, సత్యరాజ్ లుక్ రిలీజ్ చేశారు. లుక్ చూస్తేనే కడుపు నిండిపోతోంది. ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే సత్యరాజ్ కొంచెం యాక్టివ్‌గా కనిపిస్తే, ఇక ఫ్యాన్స్‌లో ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది. ఇక ఈ లుక్‌లో కనిపించినట్లు కనిపిస్తే, ఆ జోష్ మామూలుగా ఉండదు. ఈ సినిమాలో సత్యరాజ్ తాతా పాత్ర పోషిస్తున్నట్లు కనిపిస్తున్నాడు.
వర్షంలో తాత మనవళ్లు ఇద్దరూ గొడుగులు వేసుకుని వస్తుండగా, మధ్యలో సత్యరాజ్ తన గొడుగును పక్కకు పెట్టి, వర్షంలో తడుస్తూ ఎగురుతూ ఎంజాయ్ చేస్తున్నట్లు, మనవడు తాతను పట్టుకునేందుకు ముందుకు వంగినట్లుంది లుక్. ఇద్దరూ హుషారు మూడ్‌లో కనిపిస్తున్నారు. పంచెకట్టులో మెరిసిన తల కట్టుతో (తలపై జుట్టు లేదనుకోండి) ఓ బ్రిడ్జ్‌పై ఎంజాయ్ చేస్తున్న ఈ లుక్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. 'చిత్రలహరి'లో ఫుల్ గెడ్డంతో కనిపించిన సాయి ధరమ్‌తేజ్ ఈ సినిమాలో లైట్ గెడ్డంతో స్మార్ట్ లుక్స్‌లో కనిపిస్తున్నాడు.
Celebrations begin today✨@IamSaiDharamTej's #PratiRojuPandaage First Look!!!#PratiRojuPandaageFL @DirectorMaruthi @RaashiKhanna @MusicThaman @UV_Creations @GA2Official #BunnyVas @SKNonline #PratiRojuPandaageFirstLook pic.twitter.com/Ybk9rYuCxV
— UV Creations (@UV_Creations) September 11, 2019
మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం డిశంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. పల్లెటూరి బ్యాక్ గ్రౌండ్‌లో మానవ సంబంధాలకు అద్దం పట్టేలా సినిమా ఉండబోతోందనీ తెలుస్తోంది. మొత్తానికి టైటిల్‌కి తగ్గట్లుగా ఫస్ట్‌లుక్ అదరగొట్టేశారు. నిజమైన పండగ అంటే ఇదే అనేలా చూపించారు. ఫస్ట్‌లుక్‌తో తేజుకి బోణీ అదిరింది. అలాగే సక్సెస్ కూడా అదరగొట్టాలని ఆశిద్దాం.