వెంకీ క‌థ ఓకే చేసేశాడా?

By Inkmantra - December 18, 2019 - 12:45 PM IST

మరిన్ని వార్తలు

ఈ యేడాది రెండు విజ‌యాల‌తో మంచి దూకుడు మీదున్నాడు వెంక‌టేష్‌. రెండూ మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలే. అయితే ఇప్పుడు సోలో హీరోగా సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నాడు. అందులో భాగంగా `అసుర‌న్‌` రీమేక్‌ని ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడు. త‌రుణ్ భాస్క‌ర్ సినిమా కూడా ఓకే అయ్యింది. ఈలోగా మ‌రో క‌థ‌కీ ప‌చ్చ జెండా ఊపిన‌ట్టు స‌మాచారం. త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో వెంక‌టేష్ ఓ సినిమా చేస్తాడ‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆమ‌ధ్య త్రినాథ‌రావు కొన్ని క‌థ‌లు కూడా వినిపించాడు. అయితే ఏదీ వ‌ర్క‌వుట్ కాలేదు. దాంతో త్రినాథ‌రావు తో ప్రాజెక్టు లేద‌నుకున్నారు.

 

అయితే ఎట్ట‌కేల‌కు న‌క్కిన క‌థ‌కు వెంకీ ఓకే చెప్పాడ‌ట‌. ఈ కాంబినేష‌న్‌లో సినిమా త్వ‌ర‌లోనే ఉండ‌బోతోంద‌ని టాక్‌. 2020 వేస‌విలో ఈ సినిమా ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌నే ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంద‌ని టాక్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS