ఒక్క 'చిత్రమ్‌': రెండు సినిమాలు.!

మరిన్ని వార్తలు

గతంలో హారర్‌ కామెడీ చిత్రంగా వచ్చిన 'ప్రేమకథా చిత్రమ్‌' సినిమాకి సీక్వెల్‌ రానున్న సంగతి తెలిసిందే. ఈ సీక్వెల్‌లో సుమంత్‌ అశ్విన్‌ హీరోగా నటిస్తున్నాడు. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఫేం నందితా శ్వేతా, 'జంబలకిడి పంబ' ఫేం సిద్దీ ఇద్నానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుమంత్‌ నందితా శ్వేతని ప్రేమిస్తాడు. అలాగే సిద్దీని కూడా ప్రేమిస్తాడు. అయితే హీరో ఈ ఇద్దరి భామల్ని ఎందుకు ప్రేమించాల్సి వచ్చింది. 

 

విషయం తెలిసిన హీరోయిన్లు ఏం చేశారు. అసలు నందితా దెయ్యంలా ఎందుకు మారాల్సి వచ్చింది.? అనేదే అసలు కథ. వుమెన్స్‌ డే సందర్భంగా ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్‌. ట్రైలర్‌ చెప్పినట్లుగానే హారర్‌తో పాటు ఫన్‌ కూడా మిక్స్‌ అయ్యి ఉంది. నందితా దెయ్యంలా అందన్నీ భయపెట్టడం నవ్వు తెప్పిస్తోంది. అక్కడక్కడా రెండు సీన్లలో హాట్ట్‌గా కనిపిస్తూనే నట విశ్వరూపం చూపించేసింది నందితా. 

 

ఇకపోతే 'ప్రేమకథా చిత్రమ్‌'కి సీక్వెల్‌ అయినా కానీ, 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఫ్లేవర్‌ ఎక్కువగా కనిపిస్తోంది ట్రైలర్‌లో. టోటల్‌గా ఇంట్రెస్టింగ్‌గా కట్‌ చేసిన ఈ ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. హరికిషన్‌ దర్శకత్వంలో రెండు సినిమాల ఫ్లేవర్స్‌తో కలగలిసి వస్తున్న ఈ 'ప్రేమ కథా చిత్రమ్‌ 2' డబుల్‌ సక్సెస్‌ అందుకుంటుందో లేదో చూడాలంటే మార్చి 21న వరకూ వేచి చూడాల్సిందే. 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS