'సైరా' కోసం నయనతార.!

By Inkmantra - March 08, 2019 - 12:30 PM IST

మరిన్ని వార్తలు

స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతూ, సౌత్‌లో అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకుంటున్న హీరోయిన్స్‌లో టాప్‌ లెవల్‌లో ఉన్న నయనతార ప్రస్తుతం చిరంజీవి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ 'సైరా'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించడమే కాదు, ప్రమోషన్స్‌ కోసం కూడా భారీ ఎత్తున ఖర్చు చేయనున్నారట. ఇందులో భాగంగా నయనతార డేట్స్‌ని లాక్‌ చేసినట్లు సమాచారమ్‌. 

 

తెలుగు సినిమాల ప్రమోషన్స్‌కి అస్సలు ఇంట్రెస్ట్‌ చూపించదు నయనతార. కానీ సైరా నరసింహా రెడ్డి​ కోసం నయన్‌ ప్రమోషన్స్‌లో పాల్గొనబోతోందట. ఈ క్రమంలో ప్రత్యేకంగా నయన్‌పై ఓ ఇంటర్వ్యూని సిద్ధం చేశారట. మెగా డాటర్‌ నిహారిక నయనతారను ఇంటర్వ్యూ చేయనుందనీ తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో నయనతార పలు తెలుగు చిత్రాల్లో నటించింది. స్టార్‌ హీరోల సినిమాలే అయినా కానీ ససేమిరా ప్రమోషన్స్‌లో పాల్గొనలేదు.

 

కానీ 'సైరా' ప్రమోషన్స్‌కి మాత్రం నయనతార రానుందనీ తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. స్పెషల్‌ రెమ్యునరేషన్‌ తీసుకుని మరీ ఈ ప్రమోషన్స్‌లో నయన్‌ పాల్గొనబోతోందనీ తెలుస్తోంది. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోన్న 'సైరా' దసరాకి ప్రేక్షకుల ముందుకు రానుంది. కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో రామ్‌చరణ్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS