తెలుగు తెరపై మెగా సూపర్ స్టార్ అన్నదగ్గ స్థాయిలో అనూహ్యంగా పెరిగింది విజయ్ దేవరకొండ ఇమేజ్. ఒక్క సినిమా అతన్ని రాత్రికి రాత్రి స్టార్‌గా మార్చేసింది. 'రౌడీ' ఆటిట్యూడ్‌పై విమర్శలెలా ఉన్నా, ఆటిట్యూడ్‌కి వేలాది, లక్షలాది మంది అభిమానులున్నారు. 'నోటా' సినిమా పరాజయాన్ని మిగిల్చితే, ఆ తర్వాత మళ్లీ పుంజుకున్నాడు. తాజాగా 'డియర్ కామ్రేడ్'తో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్దమవుతున్నాడు.
ఒకటి, కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు భాషల్లో 'డియర్ కామ్రేడ్' హల్‌చల్ చేయబోతోంది. సౌత్ సినిమాకి కొత్త యంగ్ సూపర్‌స్టార్ అయ్యే అవకాశం విజయ్‌దేవరకొండకు ఈ 'డియర్ కామ్రేడ్' కల్పిస్తుందని అతని అభిమానులు నమ్ముతున్నారు. మార్చి 17న టీజర్ రిలీజ్ కాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది.
తెలుగులో ఇప్పటికే క్రేజీ ఆఫర్స్ డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం వస్తున్నాయనీ సమాచారమ్. ఈ సినిమాతో విజయ్ వంద కోట్ల క్లబ్‌లోకి చేరతాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రెస్టీజియస్ బ్యానర్‌గా అనతి కాలంలోనే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మైత్రీ మూవీ మేకర్స్ 'డియర్ కామ్రేడ్'ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ప్రమోషన్స్‌లో సరికొత్త పంథా అమలు చేయబోతోంది. గెట్ రెడీ టు విట్‌నెస్ 'డియర్ కామ్రేడ్'.