సమంత విడాకుల వ్యవహారం, ఆ తరువాతి పరిణామాలు టాలీవుడ్ ని ఊపేస్తున్నాయి. ఈ ఎపిసోడ్ లో ఓ కొత్త పేరు బయటకు వచ్చింది. అదే. ప్రీతమ్ జుకాల్కర్. తనతో సమంత సన్నిహితంగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఓ సోఫాలో ప్రీతమ్ కూర్చుని ఉంటే, అతనిపై కాళ్లు పెట్టి, సమంత పడుకున్న ఫొటో ఒకటి మరింత వైరల్ అవుతోంది. ప్రీతమ్ తో సమంతకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ విడాకులకూ... ప్రీతమ్ కీ లింకు ఉందా? అన్నది తాజా సందేహం.
ప్రీతమ్ జుకాల్కర్ సమంతకు వ్యక్తిగత కాస్ట్యూమ్ డిజైనర్. గత కొన్నేళ్లుగా తనతో పని చేస్తున్నాడు. సమంత చేసే ప్రతీ సినిమాకీ తనే కాస్ట్యూమ్స్ అందిస్తుంటాడు. ప్రైవేటు ఫంక్షన్లకూ తాను డిజైన్ చేసిన దుస్తులనే సమంత ధరిస్తుంది. ఇద్దరి మధ్యా మంచి అనుబంధం ఉంది. ఓ సందర్భంలో తమది అన్నా చెల్లెళ్ల బంధం అంటూ సమంత ప్రకటించింది కూడా. అయితే ఇప్పుడు మాత్రం మరో కహానీ వినిపిస్తోంది. ఇద్దరూ వ్యక్తిగతంగా బాగా దగ్గరయ్యారని, ఇది తెలిసే చైతూ సమంతకు విడాకులు ఇచ్చాడన్నది బలమైన వాదన. చైతూతో సమంత విడాకుల వ్యవహారం బయటకు రాగానే జుకాల్కర్ కొన్ని ట్వీట్లు చేశాడు. అనంతరం వాటిని డిలీట్ చేశాడు. ఇదంతా చూస్తుంటే ఇద్దరి మధ్యా ఏదైనా ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎప్పుడైతే సమంత విడాకుల వ్యవహారంలో జుకాల్కర్ పేరు బయటకు వచ్చిందో, అప్పటి నుంచీ.. జుకాల్కర్ ఎవరు? అంటూ నెటిజన్లు గూగుల్ లో వెదకడం మొదలెట్టారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది.