ఎట్టకేలకు RRR రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది. జనవరి 7న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. RRR రిలీజ్ డేట్ పక్కా అవ్వడం అభిమానులకు పండగలాంటి వార్తే. కానీ.. చిత్రసీమకు, ఇతర సినిమాలకూ ఇది చేదు వార్త. ఎందుకంటే... సంక్రాంతి బెర్తులు ఇప్పటికే నిండిపోయాయి.
భీమ్లా నాయక్, రాధే శ్యామ్, సర్కారు వారి పాట, ఎఫ్ 3... ఇలా 4 సినిమాలు బెర్తులు ఖాయం చేసుకున్నాయి. ఇప్పుడు సడన్ గా RRR నేను సైతం అంటూ రంగంలోకి దిగడం మిగిలిన సినిమాలకు షాకిచ్చే వార్తే. RRR రిలీజ్ డేట్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. అక్టోబరు 13న ఈ సినిమా రావాల్సింది. రాలేదు. ఇక RRR టార్గెట్ 2022 వేసవికే అన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. సంక్రాంతి కి RRR రాదన్న ధీమాతోనే మిగిలిన సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. అయితే సడన్ గా రాజమౌళి సంక్రాంతి బరిలో ఉన్నామంటూ ప్రకటించేశాడు. నిజానికి ప్రొడ్యూసర్ గిల్డ్ అంటూ ఒకటి వుంది. ఆ గిల్డ్ రిలీజ్ డేట్ విషయంలో నిర్మాతలకు ఓ భరోసా ఇస్తుంటుంది. ఏ రెండు పెద్ద సినిమాలూ క్లాష్ అవ్వకుండా చూసుకోవడం గిల్డ్ పని. RRR వస్తే... మిగిలిన సినిమాలు ఇబ్బంది పడతాయి. ముందుగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సినిమాకి పోటీగా మరో సినిమాని విడుదల చేయడం గిల్డ్ నిబంధనలకు విరుద్ధం. 7న RRR వస్తోందంటే.. సంక్రాంతి సీజన్ కంటే ముందు బరిలోకి దిగుతున్నట్టు. ఓరకంగా.. సంక్రాంతి కి మరో వారం గ్యాప్ ఉంటుంది. కానీ RRR లాంటి పెద్ద సినిమాతో పోటీ పడాలతని ఎవరూ అనుకోరు. ఇప్పుడు 4 సినిమాల్లో కనీసం రెండు డ్రాప్ అయ్యే పరిస్థితి వచ్చింది.
RRR వస్తోందని ముందుగా తెలిస్తే.. అసలు రిలీజ్ డేట్లే ప్లాన్ చేసుకునేవారు కాదు. అయితే ఇప్పటికీ RRR సంక్రాంతికి రావడం గ్యారెంటీనా? అంటే దానికి సమాధానం లేదు. రాజమౌళి సినిమాకి రిలీజ్ డేట్ ప్రకటించడం ఎంత సహజమో.. వాఇదా వేయడం కూడా అంతే సహజం. సో.. రాజమౌళి ప్లానింగ్ ని లైట్ తీసుకుని సినిమాని విడుదల చేయాలా? లేదంటే భయపడి సినిమాని వాఇదా వేయాలా? అనేది అంతు చిక్కడం లేదు. 4 సినిమాలు విడుదలకు ప్లాన్ చేసుకుంటే, రాజమౌళి మధ్యలో దూరడం న్యాయం కాదన్నది ట్రేడ్ వర్గాల వాదన. మరి.. RRR కి ఎన్ని సినిమాలు భయపడతాయో, ఎన్ని ఎదురెళతాయో కాలమే సమాధానం చెప్పాలి.