‘ప్రెజర్‌’ పెంచేస్తోన్న ప్రీతి అస్రాని.!

By Inkmantra - February 19, 2020 - 15:00 PM IST

మరిన్ని వార్తలు

ఛైల్డ్‌ ఆర్టిస్టుగా పాపులర్‌ అయి, హీరోయిన్స్‌గా మారిన ముద్దుగుమ్మలు గతంలో చాలా మందే ఉన్నారు. కానీ, వారంతా చైల్డ్‌ ఆర్టిస్టులుగా సంపాదించిన ఇమేజ్‌ని, హీరోయిన్స్‌గా కంటిన్యూ చేయలేకపోయారు. తాజాగా అదే దారిలో హీరోయిన్‌ అయిన ముద్దుగుమ్మ ప్రీతి అస్రాని ప్రస్తుతం సమ్‌థింగ్‌ డిఫరెంట్‌గా ఎట్రాక్ట్‌ చేస్తోంది. ‘ప్రెజర్‌ కుక్కర్‌’ సినిమాతో ఈ ఫ్రెష్‌ బ్యూటీ హీరోయిన్‌గా రంగ ప్రవేశం చేస్తోంది. ‘మళ్లీ రావా’ సినిమాలో హీరోయిన్‌ చిన్నప్పటి పాత్రలో కనిపించి, మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రీతి అస్రానికి హీరోయిన్‌గానూ మంచి ఫ్యూచర్‌ కనిపిస్తోంది. చిన్న వయసులోనే తన పాత్రలోని డిఫరెంట్‌ వేరియేషన్స్‌ని చాలా చక్కగా ప్రతిబింబించి సినిమాకి ప్రీతి ప్లస్‌ అయ్యిందన్న టాక్‌ వచ్చింది అప్పట్లో.

 

చిన్నతనంలోనే పర్‌ఫామెన్స్‌లో ఆ రేంజ్‌ టాలెంట్‌ చూపించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు హీరోయిన్‌గా ‘ప్రెజర్‌ కుక్కర్‌’కి మెయిన్‌ అస్సెట్‌ అవుతుందా.? అంటే ఖచ్చితంగా అవుననే అంటున్నారు చిత్ర యూనిట్‌. విడుదకు ముందు నుంచే ప్రీతిపై పోజిటివ్‌ టాక్‌ వినిపిస్తోంది. ప్రమోషన్స్‌లో తన అప్పియరెన్స్‌తో స్పెషల్‌గా ఆకట్టుకుంటోంది. డ్రస్సింగ్‌ సెన్స్‌, బాడీ లాంగ్వేజ్‌.. ఇలా సరికొత్త ఎట్రాక్షన్‌ కనబరుస్తోంది. కెమెరా కన్ను తనపైనే ఉండేలా జాగ్రత్త పడుతోంది. ఈ నెల 21న ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఇంతవరకూ విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై పోజిటివ్‌ వైబ్స్‌ క్రియేట్‌ చేస్తున్న క్రమంలో, ఒకవేళ సినిమా హిట్టయితే, ప్రీతి అస్రానికి హీరోయిన్‌గా నిలదొక్కుకునే కళ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS