బిగ్ బాస్ 5లో పెద్ద ట్విస్టు వచ్చి పడింది. ముందు నుంచీ టాప్ గేర్ లో దూసుకుపోతూ.. టైటిల్ ఫేవరెట్లలో ఒకరిగా చెప్పుకుంటున్న ప్రియ అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యింది. అంతకు ముందు వరకూ... బిగ్ బాస్ లో ప్రియనే టాప్. అయితే ఒక్క వారంలో పరిస్థితులు తిరగబడ్డాయి. టైటిల్ ఫేవరేట్ కాస్త డేంజర్ జోన్ లో పడి, ఆఖరికి ఎలిమినేట్ అయిపోయింది.
ప్రియకి జనాదరణ ఎక్కువ. తనకు పడే ఓటింగే ఇందుకు నిదర్శనం. ఇది వరకు కూడా ప్రియ చాలాసార్లు ఎలిమినేషన్ జోన్ లో పడింది. అయితే ప్రతీసారీ ప్రేక్షకుల ఓటింగ్ ప్రియని కాపాడుతూ వచ్చింది. ఈసారి కూడా ప్రియని ఓట్లే రక్షిస్తాయి అనుకున్నారు. కానీ అది జరగలేదు. ప్రేక్షకుల మద్దతు కోల్పోవడానికి ఓ ప్రధాన కారణం కూడా ఉంది. అదేంటంటే.. సన్నితో ప్రియ గొడవ పడే విధానం ఎవరికీ నచ్చలేదు. ముఖ్యంగా బంగారు కోడి పెట్ట టాస్క్ లో... ప్రియ ప్రవర్తన చిరాకు తెప్పించింది. అవసరమున్నా, లేకున్నా సన్నీని టార్గెట్ చేస్తూ రెచ్చ గొట్టింది. అసలు ప్రియ గేమ్ ప్లాన్ ఏమిటో చాలామందికి అర్థం కాలేదు. దాంతో సన్నిపై సానుభూతి పెరిగి, ప్రియపై ప్రేమ సన్నగిల్లింది. 7వ వారంలో.. ప్రియకి అతి తక్కువ ఓట్లు పోలయ్యాయి. అదే.. ఎలిమినేషన్‌కి దారి తీసింది.