ప్రభాస్ అభిమానుల ఆకలి.. `రాధేశ్యామ్` టీజర్ కొంత వరకూ తీర్చింది. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా `రాధేశ్యామ్` టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్ ఇప్పుడు యూ ట్యూబ్ లో సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తోంది. విడుదలైన 24 గంటగల్లోనే 50 మిలియన్స్ వ్యూస్ సాధించి సరికొత్త చరిత్ర లిఖించింది. అతి తక్కువ సమయంలో ఈ మైలు రాయిని అందుకున్న టీజర్ గా రికార్డు పుటల్లోకి ఎక్కింది. గతంలోనూ తెలుగు సినిమా టీజర్లు 50 మిలియన్ల మైలు రాయిని అందుకున్నాయి. కాకపోతే... ఇంత తక్కువ సమయంలో ఈ ఫీట్ సాధించడం ఇదే తొలిసారి.
50 మిలియన్ వ్యూస్ సాధించడానికి `అఖండ`కు 16 రోజులు తీసుకుంది. `పుష్ప`కు 20 రోజులు పట్టింది. ఇప్పుడు రాధేశ్యామ్ కేవలం 24 గంటల్లోనే దాన్ని అందుకుంది. త్వరలోనే 100 మిలియన్ల వ్యూస్ సాధించడం ఖాయమన్నది ట్రేడ్ వర్గాల టాక్. అదే జరిగితే.. బాలీవుడ్ రికార్డుల్నీ ఈ టీజర్ బ్రేక్ చేసినట్టు అవుతుంది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ఈ చిత్రం విడుదల కాబోతోంది.