కన్ను గీటి, ముద్దుల గన్నులు ఎక్కుపెట్టి, రాత్రికి రాత్రే స్టార్ అయిపోయిన మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ఆకాష్ వారియర్. 'ఒరు అదార్ లవ్' చిత్రంతో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా తెరంగేట్రం చేస్తోంది. మలయాళ సినిమా అయినప్పటికీ, ఈ నాటీ బ్యూటీ దేశమంతా పాపులర్ అయిపోయింది. సినిమాకి సంబంధించిన ఓ సాంగ్‌లో ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్సే ఇంత పబ్లిసిటీకి కారణం.
పాపులారిటీతో పాటు, అనూహ్యంగా వివాదాలు కూడా ఆమెను చుట్టుముట్టాయి. అయితే ఈ వివాదాల నిమిత్తం సుప్రీంకోర్టునాశ్రయించిన ప్రియా వారియర్‌కి ఆ కేసుల నుండి ఊరట పొందింది. సుప్రీంకోర్టు స్టే విధించింది. ఒక్క పాట ఇంతగా సెన్సేషన్ అవుతుందని తాను ఊహించలేదనీ ప్రియ వాపోతోంది. ఇంతగా సెన్సేషన్ సృష్టించిన ఈ సినిమా మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఇచ్చిన లవ్ ఎక్స్ప్రెషన్స్ మెచ్చి, అమ్మడికి వివిధ భాషల నుండి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయన్న సంగతి తెలిసిందే. అయితే ఇంకా వేటికీ ఈ ముద్దుగుమ్మ ఓకే చెప్ప లేదట.
తెలుగులో కూడా ఓ సినిమా కోసం అమ్మడితో సంప్రదింపులు జరిగాయట. ఎక్కువగా యంగ్ హీరోలు ఈ ముద్దుగుమ్మకి ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నారనీ తెలుస్తోంది. కానీ ఇప్పుడప్పుడే తెలుగులో సినిమాలు చేసే ఆలోచన లేదంటోంది ప్రియా ఆకాష్ వారియర్. భవిష్యత్తులో తనని ఇంప్రెస్ చేసే కథలు వస్తే తప్పకుండా చేస్తానంటోంది. తనకిష్టమైన నటి ఎవరంటే బాలీవుడ్ నటి దీపికా పదుకొనె గురించి చెబుతోంది. జస్ట్ హావభావాలతోనే అందర్నీ ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మకి దీపికా ఎక్స్ప్రెషన్స్ అంటే చాలా ఇష్టమంటోంది.