మార్చ్ 2 నుండి థియేటర్ల బంద్

మరిన్ని వార్తలు

దక్షిణాది రాష్ట్రాల నిర్మాతలు, పంపిణీదారుల ఐకాస అలాగే క్యూబ్-యూఎఫ్ఓ మధ్య నేడు బెంగుళూరులో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీనితో ఐకాస వారు ముందుగా ప్రకటించిన విధంగా దక్షిణాది రాష్ట్రాలలో సినిమా ప్రదర్శనలు మార్చ్ 2 నుండి నిలిచిపోనున్నాయి.

ఇక గత కొన్ని నెలలుగా నిర్మాతలు-పంపిణీదారులకి డిజిటల్ ప్రొవైడర్లకి జరుగుతున్న గొడవల కారణంగా వీరిరువురు నేడు సమావేశం అయ్యారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశ్యం వర్చువల్ ప్రింట్ ఫీజ్ క్రమేపి తగ్గించడం ఆ తరువాత కాలంలో పూర్తిగా తీసెయ్యడం.

అయితే ఈ ముఖ్య డిమాండ్ కి క్యూబ్ & యూఎఫ్ఓ ప్రతినిధులు అంగీకరించకపోవడంతో ఈ సమస్య మొదటికి వచ్చింది. అయితే తమ డిమాండ్ నెరవేర్చని పక్షంలో సినిమాలని ధియేటర్లకి ఇచ్చే ప్రశ్నే లేదని నిర్మాతలు-పంపిణీదారులు స్పష్టం చేస్తున్నారు. 

మరి ఈ అంశంలో తరువాత ఏమి జరుగుతుందో వేచి చూడాలి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS