కన్ను గీటి రాత్రికి రాత్రి స్టార్ అయిపోయిన ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్. ఎంత ఎత్తుకి ఎదిగిందో ఒకే ఒక్క సినిమాతో అంత పాతాళానికి దిగజారిపోయింది ప్రియా ప్రకాష్ వారియర్. రాత్రికి రాత్రి సునామీలా పోటెత్తిన ఆమె క్రేజ్ ఎంతో కాలం నిలవలేదు. తొలి సినిమా 'లవర్స్'తోనే వచ్చిన క్రేజ్ అంతా ఆవిరైపోయింది. దాంతో తర్వాత ప్రియాని పట్టించుకున్న వాళ్లే కరువయ్యారు.
అంతవరకూ ప్రియా కోసం ముచ్చటించుకున్న వాళ్లు కూడా మొహం చాటేశారు. దాంతో వెనక్కి వెళ్లిపోయిన ప్రియా కామ్‌గా తన పని తాను చూసుకుంటోంది. ఈ తరుణంలో తెలుగు నుండి నితిన్ పుణ్యమా అని ఓ ఛాన్స్ వచ్చింది. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో నితిన్ నటిస్తున్న సినిమాలో ప్రియా ప్రకాష్‌కి సెకండ్ హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది. రకుల్ ప్రీత్‌సింగ్ ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఆ పూజా కార్యక్రమానికి హాజరైన ప్రియా ప్రకాష్ వారియర్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఇకపోతే బాలీవుడ్లో ప్రియా 'శ్రీదేవి బంగ్లా' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఆ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇదిలా ఉంటే, మరోవైపు ప్రియా ప్రకాష్ వారియర్ తనలోని కొత్త టాలెంట్‌ని బయటికి తీసి, ఫ్యాన్స్‌కి షాకిచ్చింది.
ఇంతకీ ఆ కొత్త టాలెంట్ ఏంటయ్యా అంటే, సింగింగ్. క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఓ మలయాళ సినిమా కోసం ప్రియా ప్రకాష్ తొలిసారి గొంతు సవరించుకుంది. గాయకుడు సురేస్ అయ్యర్‌తో కలిసి ప్రియా తొలిసారి పాట పాడారు. కైలాష్ మేనన్ ఈ పాటకి మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఈ పాట ఆలపిస్తున్న టీజర్‌ని ప్రియా తన ట్విట్టర్లో పోస్ట్ చేసి, 'నా ఈ తొలి ప్రయత్నాన్ని మెచ్చుకున్న మీ అందరికీ ధన్యవాదాలు..' అంటూ ట్విట్టర్ ద్వారా సంతోషాన్ని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నారు.