చాలా సినిమాల్లో చాలా మంది ముద్దుగుమ్మలు కన్ను కొట్టారు. కానీ ఇప్పుడు ఆ 'కన్ను కొట్టడం' నేరమట. ముస్లింల మనోభావాలు దెబ్బ తిన్నాయట. అందుకే పోలీసు కేసు కూడా పెట్టారట.. ఇదీ తాజాగా వైరల్ అవుతున్న న్యూస్. అసలింతకీ ఆ కన్ను కొట్టుడేంటి? పోలీసు కేసుల దాకా వెళ్లడమేంటి..
అనే వివరాల్లోకి వెళితే, ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ మలయాళ సినిమాకి సంబంధించిన పాటలో హీరోయిన్, హీరోకి కన్ను కొట్టే సీన్లు యూత్‌ని ఎట్రాక్ట్ చేసి, ఎంతగా వైరల్ అయ్యాయో తెలిసిన సంగతే. ఆ వైరల్‌కి సంబంధించిన మరో వైరల్ న్యూసే ఇదన్నమాట. అదో రొమాంటిక్ కాలేజ్ సాంగ్. ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య లవ్‌ని డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఎక్స్‌ప్రెస్ చేసే సన్నివేశాలవి. ఆ సన్నివేశాల మీదే ఇప్పుడు ఈ అభ్యంతరాలు. గతంలోనూ ఇలాంటి చాలా సీన్స్ చాలా సినిమాల్లో చూశాం.
కానీ అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకు వచ్చాయో. అయినా ఈ సోషల్ మీడియా ప్రభావంతో ఎప్పుడు ఏ సీన్ ఎందుకు వైరల్ అవుతుందో తెలీడం లేదు. అలా ఈ సీన్ ఇప్పుడు కొత్తగా వైరల్ అయ్యింది. సీన్ కట్ చేస్తే, ఈ మొత్తం సాంగ్‌లో అమ్మాయి కన్ను కొట్టే సీన్ ఒక్కటీ కట్ చేసి పెట్టి, ఇటు ప్రింట్ మీడియాలోనూ, అటు సోషల్ మీడియాలోనూ కూడా సెన్సేషన్ చేసేశారు. అయితే ఈ సీనే ఇప్పుడు తంటా తెచ్చి పెట్టింది. మనోభావాలు దెబ్బ తినడం అనే మాట కూడా ఇప్పుడు చాలా సింపుల్ అయిపోయింది.
వినోదాన్ని వినోదంగా చూడకుండా, మనో భావాలకు లింక్ పెట్టి, అనవసర వివాదాలు తెచ్చిపెడుతున్నారు. ఆ కోవలోనే ఈ తాజా వివాదం కూడా వైరల్ అయ్యింది. అయితే అయ్యింది కానీ, మలయాళంలో తెరకెక్కుతోన్న ఈ 'ఒరు ఆదార్ లవ్' సినిమాకి ఈ వివాదం ఓ రకంగా ఫ్రీ పబ్లిసిటీగా పనికొస్తుందేమో చూడాలి మరి.