ఆర్ఆర్ఆర్‌' అదృష్టదేవతలు ఎవరంటే.!

మరిన్ని వార్తలు

టాలీవుడ్‌ బిగ్‌ మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతోన్న 'ఆర్ఆర్ఆర్‌' ఇటీవల సెట్స్‌ పైకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ డే నుండే భారీగా అంచనాలు నమోదు చేసింది. ఇక ఈ సినిమాలో టాలీవుడ్‌ ఈ తరం స్టార్‌ హీరోలైన మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటిస్తుండడంతో వీరి పాత్రలు ఇలా ఉండబోతున్నాయట. కథని ఇలా చూపించనున్నారట అంటూ రకరకాల గాసిప్స్‌ బయటికి వస్తూనే ఉన్నాయి. అయితే తాజా అప్‌డేట్‌ ఏంటంటే సినిమాకి అత్యంత కీలకమైన యాక్షన్‌ ఘట్టాల్ని ప్రస్తుతం చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో హీరోయిన్స్‌ లిస్ట్‌ ఇంకా తెలియరాలేదు. కానీ కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. ఆ లిస్టులో ఫ్రెష్‌గా ప్రియమణి పేరు చేరింది. అయితే ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్‌ కాదట. ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ పోషించనుందట. రాజమౌళి తన సినిమాల్లో హీరోయిన్స్‌ కోసం అస్సలు పరిధులు దాటి ఆలోచన చేయడు. ఏమంత ఫేమ్‌ లేని హీరోయిన్స్‌నే ఎంచుకుంటుంటాడు. ఒక్కసారి రాజమౌళి సినిమాలో నటించాకే ఆ హీరోయిన్‌కి ఊహించని పాపులారిటీ దక్కుతూ ఉంటుంది.

ఈ సారి అలా ఫామ్‌లోకి వచ్చే హీరోయిన్‌ ఎవరో కానీ, ప్రియమణి గతంలో 'యమదొంగ' మూవీలో నటించింది. మరోవైపు కీర్తిసురేష్‌ పేరు బాగా వినిపిస్తోంది. 'మహానటి' మినహాయిస్తే, ఈ మధ్య కీర్తిసురేష్‌ కెరీర్‌లో కూడా పెద్దగా సక్సెస్‌లు లేవు. ఒకవేళ ఆదృష్టం కలిసొచ్చి 'ఆర్ఆర్ఆర్‌'లో ఛాన్స్‌ దక్కిందంటే ఆమె స్టార్‌ తిరిగినట్లే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS