ఎప్పుడూ ఇన్నోవేటివ్‌గా ఆలోచించే రవిబాబు, కరోనా కాలాన్ని కూడా ఇన్నోవేటివ్‌గానే ఆలోచించాడు. చాలా మంది సెలబ్రిటీలు, ‘బీ ద రియల్ మేన్’.. అంటూ ఛాలెంజ్‌లు పూర్తి చేస్తున్నారు. కొందరు సెలబ్రిటీలు తమదైన శౖలిలో పాటలు రాస్తూ, ఆలపిస్తున్నారు. మరికొందరు కరోనాపై పబ్లిక్‌కి అవేర్‌నెస్ కల్గిస్తూ కొన్ని ఫన్నీ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. అయితే, మన అల్లరి దర్శకుడు రవిబాబు ఏం చేశారో తెలుసా.? కరోనా కారణంగా లాక్‌డౌన్ ఆనివర్సరీని సెలబ్రేట్ చేసుకున్నారు.
‘కరోనా ఆనివర్సరీనా.?’ అదేంటనుకుంటున్నారా.? అవునండీ కరోనా వైరస్ ప్రభావంతో భారత ప్రభుత్వం లాక్‌డౌన్ విధించి ఈ రోజుకు నెల రోజులు పూర్తయ్యింది. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూనే, మన వెర్సటైల్ దర్శకుడు రవిబాబు, కరోనా ఆనివర్సరీని సెలబ్రేట్ చేసుకున్నారు. కేక్ కట్ చేసి, బ్యాక్ గ్రౌండ్‌లో బర్త్‌డే సాంగ్ మాదిరి, ఓ మ్యూజిక్ కూడా ప్లే చేసుకుంటూ, ఏడ్చుకుంటూ, ఈ సెలబ్రేషన్ వీడియోని రిలీజ్ చేశారాయన. పక్కనే ఆయన తండ్రి గారు చలపతిరావుగారు కూడా ఉన్నారు. కేక్ కట్ చేసి, చలపతిరావు నోట్లో పెట్టగా, కుమారుడి అల్లరికి విస్తుపోయి ఆయన అక్కడి నుండి వెళ్లిపోయారు. ఆ కేక్‌ని సోలోగా రవిబాబే తినేశారు. అదీ రవిబాబుగారి ‘అల్లరి కరోనా ఆనివర్సరీ ముచ్చట. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.