బాలీవుడ్ నుండి హాలీవుడ్ కి వెళ్ళి అక్కడి వాళ్ళతో స్టార్ అని అనిపించుకోవడమే గాక అక్కడి సెలబ్రిటీ అయిన నిక్కి జోనాస్ అనే ప్రముఖ సింగర్ ని వివాహమాడడానికి సిద్ధం అయింది మన నటి ప్రియాంక చోప్రా.
తాజాగా ఆమె తన పెళ్ళికి సంబంధించిన వివరాలని, సినీ పరిశ్రమలోని తనకి అత్యంత సన్నిహితులకి నిన్న ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇచ్చిన విందులో ప్రియాంక పంచుకుంది. ఇక అదే సమయంలో తమ నిశ్చితార్దానికి నిక్కి తనకి ఇచ్చిన ఉంగరాన్ని అందరికీ చూపిస్తూ తన ఆనందాన్ని మిగతావారితో పంచుకున్నట్టుగా తెలిసింది.
అయితే ఆ ఉంగరం విలువ ఎంతో తెలుసుకుని ఆ పార్టీ లోని వారంతా ఒక్కసారి షాక్ కి గురయ్యారట. ఇంతకీ ఆ ఉంగరం ధర రెండు లక్షల డాలర్ల పైనే అట! మన కరెన్సీలో కోటి 40 లక్షల పైనే ఉంటుంది. ఇది కొనడానికి తన బాయ్ ఫ్రెండ్ ఒకరోజు మొత్తం సదరు షాప్ లో ఉండి మరీ సెలెక్ట్ చేసిన ఉంగరం అట ఇది.
ఇది విన్నాక అక్కడున్న వారంతా ప్రియాంక చాలా అదృష్టవంతురాలు కదా అని నోరు వెళ్లబెడుతున్నారట..