`సలార్`.. ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న సినిమా. ప్రభాస్ హీరో కావడం, కేజీఎఫ్ తరవాత.. ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా అవ్వడం వల్ల ఈ సినిమాకి ముందే సూపర్ బజ్ వచ్చేసింది. శ్రుతిహాసన్ ని ఓ కథానాయికగా ఎంపిక చేసిన ఈ సినిమాలో.. స్టార్ బలం బాగానే కనిపించబోతోంది. ఇప్పుడు ఓ ప్రత్యేక గీతం కోసం ప్రియాంకా చోప్రాని ఎంచుకున్నారని సమాచారం అందుతోంది. సలార్‌కు ముందు నుంచే... బాలీవుడ్ మార్కెట్ పై ఫోకస్ ఉంది.
ఎలాగైనా అక్కడి నుంచి సింహ భాగం వసూళ్లు అందుకోవాలని చూస్తోంది. అందుకే... బాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని ఈ సినిమాలో భాగం చేస్తోంది. ప్రత్యేక గీతంలో నటించడానికి సౌత్ ఇండియన్ హీరోయిన్లు సిద్ధంగానే ఉన్నా, సలార్ దర్శక నిర్మాతల దృష్టి మాత్రం బాలీవుడ్ పై పడింది. ప్రియాంకా చోప్రా అయితే.. ఈ పాటకు మరింత హైప్ వస్తుందన్నది వాళ్ల నమ్మకం. అందుకే ప్రియాంకాని సంప్రదించాలని భావిస్తున్నార్ట. ఇటీవల సింగరేణీ బొగ్గు గనులలో `సలార్` మొదలైన సంగతి తెలిసిందే.
పది రోజుల పాటు అక్కడే షూటింగ్ జరిగింది. సోమవారంతో తొలి షెడ్యూల్ కూడా ముగిసింది. ఈ తొలి షెడ్యూల్ లో ప్రభాస్‌పై కొన్ని యాక్షన్ సన్నివేశాల్ని తెరకెక్కించారు. మరుసటి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరగబోతోంది. ఇందుకోసం ఓ ప్రత్యేకమైన సెట్ ని సిద్ధం చేస్తున్నారు.