రీమేక్ సినిమాలంటే వెంకటేష్ కి ఎంతిష్టమో. కథని వెదుక్కోవాల్సిన అవసరం లేదు. ఆ కథ జనానికి నచ్చుతుందా, లేదా? అనే బెంగ లేదు. మినిమం గ్యారెంటీ ఉంటుంది కదా. ఈ స్ట్రాటజీ వెంకీకి బాగా కలిసొచ్చింది. అందుకే.. చాలా విజయాల్ని తీసుకొచ్చింది. ఈమధ్య వెంకటేష్ చేసిన రీమేకుల్లో... గుర్తిండిపోయే సినిమా `దృశ్యం`. మలయాళ రీమేక్ గా వచ్చిన ఈ సినిమాలో.. వెంకటేష్, మీనా జంటగా నటించారు. ఇప్పుడు మలయాళంలో `దృశ్యం 2` రీమేక్ పూర్తయ్యింది.
ఈనెల 19న విడుదల అవుతోంది. ఆ సినిమా రిజల్ట్ ఏమిటో ఇంకా బయటకు రాకుండానే సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ రీమేక్ రైట్స్ సంపాదించేసింది. వెంకీతో ఈ సినిమా చేయాలని ఫిక్సయిపోయింది. దృశ్యం ఎక్కడైతే ఆగుతుందో.. అక్కడి నుంచి దృశ్యం 2 కథ మొదలవుతుంది. దృశ్యం 1లో కనిపించినవాళ్లే.. 2లోనూ దర్శనమిస్తారు. కాకపోతే.. దృశ్యంలో వెంకీ కూతుర్లుగా నటించిన వాళ్లు ఇప్పుడు పెద్దవాళ్లయ్యారు. వాళ్ల స్థానంలో ఎవరిని తీసుకుంటారో చూడాలి. వెంకీ ప్రస్తుతం నారప్పతో బిజీగా ఉన్నాడు. ఎఫ్ 3 కూడా చేస్తున్నాడు. ఎఫ్ 3 పూర్తయిన వెంటనే.. దృశ్యమ్ 2 పట్టాలెక్కుతుంది.