ఈనెల 12న విడుదల కానున్న ఉప్పెనపై చిత్రసీమ దృష్టి పడిపోయింది. దానికి చాలా కారణాలున్నాయి. మెగా కుటుంబం నుంచి మరో హీరో వస్తుండడం, సుకుమార్ శిష్యుడి సినిమా కావడం, కృతి శెట్టి.. గ్లామర్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, విజయ్‌సేతుపతి విలనిజం.. ఇలా - చాలా కోణాల్లో ఉప్పెన సినిమా జనాల్ని టెమ్ట్ చేస్తోంది. దానికి తోడు పాజిటీవ్ బజ్... ఈ సినిమాకి ప్రధాన బలం. కాకపోతే... `ఉప్పెన` క్లైమాక్స్ పై రకరకాల వార్తలొస్తున్నాయి. పతాక సన్నివేశాలు తమిళ సినిమా చూసిన ఫీలింగ్ కలిగిస్తాయని, ఒళ్లు గగుర్పాటుకి గురి చేసే అంశాలు ఉంటాయని. ఆ క్లైమాక్స్ తెలుగు ప్రేక్షకులకు నచ్చకపోయే ప్రమాదం ఉందన్నది ఆ వార్తల సారాంశం.
ఈ సినిమా క్లైమాక్స్ మార్చాలని చాలా ఒత్తిడి వచ్చిందని, కానీ సుకుమార్ శిష్యుడు బుచ్చి.. ఏమాత్రం ఒప్పుకోలేదని, సుకుమార్ కూడా శిష్యుడికి వంత పాడడంతో... ముందు రాసుకున్న క్లైమాక్స్ రాసుకున్నట్టే తీసేశారని, ఆ క్లైమాక్స్ ఎంత వరకూ నచ్చుతుంది అనే దానిపైనే సినిమా ఫలితం ఆధార పడి ఉందని చెప్పుకుంటున్నారు. అయితే... ఈసినిమా క్లైమాక్స్ పట్ల హీరో వైష్ణవ్ తేజ్ సంతృప్తిగానే ఉన్నాడు. తనకు క్లైమాక్స్ విషయంలో ఎలాంటి భయాలూ లేవని, క్లైమాక్స్ ఓ డివైన్ ఫీల్ లో సాగుతుందని, కచ్చితంగా తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త తరహా.. క్లైమాక్స్ ని చూపించబోతున్నామని చెబుతున్నాడు. మరి ప్రేక్షకులు ఏమంటారో??