'శశివదనే' టీజర్ టాక్: గోదారి అందాల గుమ్మరింత

మరిన్ని వార్తలు

రక్షిత్ అట్లూరి అంటే చాలామందికి తెలియకపోవచ్చు కానీ ‘లండన్ బాబులు’, ‘పలాస’ హీరో అంటే అందరూ గుర్తు పడతారు. లేటెస్ట్ గా ‘శశివదనే' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రక్షిత్‌ సరసన కోమలీ ప్రసాద్ నటిస్తోంది. ఈ మూవీ టీజర్‌ను బుధవారం రిలీజ్ చేశారు. సాయి మోహన్ ఉబ్బన తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోశాల ఈ సినిమాను నిర్మించారు. శరవణ వాసుదేవన్ సంగీతం అందించారు.


టీజర్ చూస్తేనే స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమ కథ అని తెలుస్తోంది. 2000 సంవత్సరం గోదావరి జిల్లాల నేపథ్యంలో జరిగిన ఒక అందమైన ప్రేమకథ. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ వినసొంపుగా ఉన్నాయి. టీజర్ లాస్ట్‌లో పాడుబడిపోయిన ఇంటిని చూపించి చిన్న సస్పెన్స్ కూడా క్రియేట్ చేశారు.  'శశివదనే' గోదావరి జిల్లాల నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమే. కానీ 'గోదావరి నేపథ్యంలో రూపొందిన తొలి యాక్షన్ అండ్ లవ్ డ్రామా ఇది' అని నిర్మాత అహితేజ తెలిపారు. టీజర్‌లో మాత్రం యాక్షన్ సీన్స్ ని రివీల్ చేయలేదు. ఈ సినిమా నుంచి విడుదల అయిన 'శశివదనే శశివదనే... నువ్వుంటే చాలుగా! నీ వెనుకే... నా అడుగే!  నీ సగమే నేనుగా!' పాట పెద్ద హిట్ అయింది.


సినిమాలో రక్షిత్ అట్లూరి అద్భుతంగా నటించాడని పేర్కొన్నారు. కోమలి ప్రసాద్ అందంతో పాటు అభినయానికి ఆస్కారం ఉన్న పాత్ర చేశారని వివరించారు. 'శశివదనే' సినిమాలో రఘు కుంచె, తమిళ నటుడు శ్రీమాన్, కన్నడ నటుడు దీపక్ ప్రిన్స్, 'రంగస్థలం' మహేష్ , ప్రవీణ్ యండమూరి, 'జబర్దస్త్' బాబీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS