బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా ఇటీవల హాలీవుడ్ నటుడు నిక్ జోనాస్‌తో ప్రేమాయణం సాగించి, ఆయన్ని తనతో పాటు స్వయంగా ఇండియాకు తీసుకొచ్చి, వివాహానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. రేపో మాపో నిక్‌తో ప్రియాంకా నిశ్చితార్ధం జరగనుందన్న వార్తలు ఇటీవల మీడియాలో హల్‌చల్ చేశాయి. అయితే ఆ వార్తలకు చెక్ పడినట్లే. అంటే నిక్ - ప్రియాంకాల నిశ్చితార్ధం జరిగిపోయింది.
అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. నిక్ - ప్రియాంకా హిందూ సాంప్రదాయంలో నిశ్చితార్ధం చేసుకున్నారు. అతి కొద్ది మంది ముఖ్యమైన అతిధుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. పసుపు పచ్చని బ్రైట్ కాస్ట్యూమ్‌లో మేలి ముసుగులో ప్రియాంకా ఫోటోలకు పోజిచ్చింది. ఒక ఫోటో బ్యాక్ గ్రౌండ్‌లో 'ఎన్' 'పి' అనే లెటర్స్ రాసున్నాయి. అక్కడే నిక్, ప్రియాంకాలు ఎంగేజ్‌మెంట్ రింగ్స్ మార్చుకుంటున్నారు.
మొత్తానికి ఈ ఫోటోలతో నిక్ - ప్రియాంకాల నిశ్చితార్ధం, పెళ్లి విషయంలో ఓ క్లారిటీ వచ్చేసింది. నిక్ వయసులో ప్రియాంకా కన్నా పదేళ్లు చిన్నోడు. అంత చిన్నోడ్ని వివాహం చేసుకోవడమేంటా? అని నెటిజన్లు ఆమెను కామెంట్ చేయగా, నా పెళ్లి నా ఇష్టం అని గతంలో ఘాటుగా ప్రియాంకా సమాధానమిచ్చిన సంగతి తెలిసిందే.