అందాల భామ ప్రియాంకా చోప్రాకి చెప్పుకోలేనంత బాధ వచ్చి పడింది. దీనికంతటికీ కారణం ఓ బ్యాంక్‌ని 11 వేల 500 కోట్లకు ముంచేసిన నీరవ్ మోడీ అనే ఓ పారిశ్రామిక వేత్త. అదేంటి, ఈ పారిశ్రామిక వేత్తకీ, ప్రియాంక చోప్రాకి లింకేంటబ్బా అనుకుంటున్నారా? లింకు ఉంది. ఈ పారిశ్రామిక వేత్తగారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ జ్యూయలరీ చైన్‌కి ప్రియాంకా చోప్రా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది మరి. ఓస్ అంతేనా అయితే ఏంటి? అనుకుని సింపుల్‌గా తీసి పారేయకండి మరి.
బ్రాండ్ అంబాసిడర్ అంటే ఏదో వేలు, లక్షలు కాదు. కోట్లలో వ్యవహారం. కనీ వినీ ఎరుగని భారీ ప్రైసింగ్‌తో అమ్మడు ఈయనగారితో డీల్ సెట్ చేసుకుంది మరి. దాంతో హాట్ హాట్‌గా జ్యూయలరీ ధరించి, ప్రకటనల్లో కనిపించేసింది. దాంతో సినిమాల్లో హీరోయిన్‌గా నటించడానికి తీసుకునే మొత్తం కన్నా భారీ మొత్తాన్ని ఈ యాడ్స్ ద్వారా ప్రియాంకా చోప్రా సొంతం చేసుకుంటోందంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ తాజా కుంభకోణం బయట పడ్డాక అసలు ప్రియాంక, నీరజ్ పాండే నుండి డబ్బులే తీసుకోలేదనీ, మొత్తానికి ఆయన డబ్బులు ఎగ్గొట్టాడనీ తేలింది. అందుకే ప్రియాంకా చోప్రా పోలీసులను ఆశ్రయించిందనీ, ఆ విషయమై ప్రియాంక ఫిర్యాదుతో పోలీసులు కేసు పెట్టారనీ ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ లేదంటూ మళ్లీ ప్రియాంకా తన మేనేజర్ చేత ప్రకటన చేయించింది.
ఈ తతంగమంతా చూస్తున్న నెటిజన్లు 'ఓ హీరోయిన్ ఫలానా సినిమాకి పది కోట్లు రెమ్యునరేషన్ తీసుకుందట' అనే మాటలో తెర వెనుక లాలూచీలు ఎలా ఉంటాయో' అన్న చందంగా ఈ వ్యవహారం ఉందంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ఇదే మన అందాల భామకి పెద్ద తలనొప్పిగా మారి, కక్కలేక, మింగలేక అన్నట్లుగా తయారయ్యింది పరిస్థితి.