ప్రియాంకతో తాప్సీ పోటీపడుతుందా?

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌లో అగ్రతారగా వెలుగొందుతున్న ముద్దుగుమ్మ ప్రియాంకా చోప్రా. ఈ మధ్యనే హాలీవుడ్‌ని కూడా చక్కబెట్టి వచ్చేసింది. త్వరలో తన బోయ్‌ ఫ్రెండ్‌ని వివాహం చేసుకోబోతోంది. ఇవన్నీ తెలిసిన విషయాలే. అయితే కొత్తగా ఏముందనుకుంటున్నారా? 

'మేరీకోమ్‌' బయోపిక్‌తో ప్రియాంకా చోప్రాకి మంచి గుర్తింపు దక్కిన సంగతి తెలిసిందే. బయోపిక్స్‌కి ప్రస్తుతం డిమాండ్‌ బాగా ఉన్న ఈ తరుణంలో తాజాగా బాలీవుడ్‌లో మరో బయోపిక్‌కి రంగం సిద్ధమవుతోంది. మహిళా క్రికెట్‌ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ జీవిత చరిత్రను తెరకెక్కించేందుకు వయా కామ్‌ సంస్థ హక్కులు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ బయోపిక్‌లో నటించేది ఎవరు? అనేదే ప్రస్తుతం ప్రశ్న. 

ఈ పాత్రను పోషించేందుకు పలువురు ముద్దుగుమ్మల పేర్లు పోటీపడుతున్నాయి. వారిలో ఈ పాత్ర పోషించాలని తెగ కుతూహలంగా ఉన్న భామ తాప్సీ పన్ను. తెలుగులో గ్లామర్‌ డాళ్‌గా పేరు పొందిన తాప్సీ బాలీవుడ్‌లో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ, యాక్షన్‌ గాళ్‌గా పేరు తెచ్చుకుంది. ఇదే ఇమేజ్‌తో ఇప్పుడు మిథాలీ రాజ్‌ బయోపిక్‌కి గాలమేస్తోందట తాప్సీ. 

ఆల్రెడీ హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీస్‌లో నటించి, తాప్సీ తన టాలెంట్‌ చూపించేసింది. కానీ ఎందుకో మిథాలీ రాజ్‌ పాత్రలో నటించాలని తనకు ఉత్సాహంగా ఉందన్న మనసులోని కోరికను బయటపెట్టింది. ఈ పాత్ర కోసం నిర్మాణ సంస్థ ప్రియాంకా చోప్రా, కంగనా వంటి స్టార్‌డమ్‌ ఉన్న హీరోయిన్స్‌ని పరిశీలిస్తున్నారు. ఆ మాటకొస్తే యాక్టింగ్‌ పరంగా తాప్సీ ఏమంత తక్కువ కాదనే చెప్పాలి. 

ఇకపోతే ప్రియాంకా ప్రస్తుతం పెళ్లి మూడ్‌లో ఉంది. ఇక కంగనా 'మణికర్ణిక' చిత్రం విడుదల కోసం చూస్తోంది. మరి ఈ పాత్రలో నటించేందుకు అత్యుత్సాహం చూపిస్తున్న తాప్సీకే ఆ ఛాన్స్‌ దక్కుతుందో లేదో చూడాలిక.
 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS