హబ్బీ తీసిన పిక్స్‌తో హాట్‌ ప్లేస్‌ దక్కించుకుంది.

మరిన్ని వార్తలు

దేశీ గాళ్‌ ప్రియాంకా చోప్రాకి తిరుగే లేదు. కొంత కాంట్రవర్సీలు వచ్చినా, అదంతా ఆమె పాపులారిటీని మరింత పెంచేందుకే సాయపడుతుంది. కానీ, ఇమేజ్‌కి ఏమాత్రం డ్యామేజ్‌ కాదు. తాజాగా ప్రియాంకా ఇన్‌స్టాలో కొన్ని ఫోటోలు పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం భర్త నిక్‌తో కలిసి వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తున్న ప్రియాంకా చోప్రా స్విమ్‌ సూట్‌లో కొన్ని ఫోటోలకు పోజిచ్చింది. ఈ ఫోటలను స్వయానా తన భర్త నిక్‌ జోనాస్‌ తీశాడనీ పేర్కొంది.

priyanka chopra hot pics

ఈ ఫోటో ఇప్పుడు ప్రియాంకా రికార్డుల్ని మరింత పెంపు చేసింది. ప్రముఖ అమెరికన్‌ మ్యాగజైన్‌ విడుదల చేసే 'గ్లోబల్‌ మీడియా క్లైంబర్స్‌ చార్ట్‌'లో ప్రియాంకా తొలి స్థానం దక్కించుకుంది. నిజానికి ఈ మ్యాగజైన్‌ జాబితాలో ప్రియాంక తొలిస్థానంలో నిలవడం ఇది 12 వసారి కావడం విశేషం.

priyanka chopra hot pics

ఇదే మ్యాగజైన్‌లో గతవారం ఆరోస్థానంలో ఉన్న ప్రియాంకా, ఈ వారం తొలి స్థానాని కైవసం చేసుకోవడానికి కారణం ఈ హాట్‌ పిక్కే. హాట్‌ హాట్‌ పోజుల్లో ఎన్నో పిక్స్‌ ఈ గ్లోబల్‌ బ్యూటీకి సంచలన రికార్డులు సొంతం చేసుకునేలా చేశాయి.

priyanka chopra hot pics

కానీ, తన భర్త నిక్‌ జోనాస్‌ తీసిన ఈ ఫోటో తనకి అన్నింట్లోనూ ప్రత్యేకం అని ప్రియాంకా చోప్రా చెబుతోంది. ప్రస్తుతం ప్రియాంకా ఓ వైపు హాలీవుడ్‌ మూవీస్‌తోనూ, ఇంకోవైపు బాలీవుడ్‌ ప్రాజెక్టులతోనూ బిజీగా ఉంది. షూటింగ్‌ నుండి కాస్త టైం దొరికినా భర్తతో కలిసి ఇదిగో ఇలా వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తూ, ఫ్యాన్స్‌తో ఆ విషయాల్ని షేర్‌ చేసుకుంటూ మురిసిపోతుంటుంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Best use of a vacation. The hubby taking pictures. Lol 😝 📷@nickjonas 👙 ☀️ 🍸 💏

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS