బన్నీని చూసి మనసు పారేసుకుందట.!

మరిన్ని వార్తలు

అదేంటో మహేష్‌బాబు తర్వాత బన్నీ అంటేనే అమ్మాయిలకు క్రేజ్‌ ఎక్కువ. అవునులే స్టైలిష్‌ స్టార్‌ అని ఆయన పేరుకు ముందే ఉంది కదా. స్టైల్‌ నచ్చని అమ్మాయిలు ఎవరుంటారు చెప్పండి. అయితే అసలు విషయానికి వచ్చేద్దాం. 

తాజాగా ప్రియాంకా జవాల్కర్‌ అదేనండీ విజయ్‌ దేవరకొండ కొత్త చిత్రం 'టాక్సీవాలా'తో పరిచయం కాబోతోంది కదా ఆ ముద్దుగుమ్మే. ఈ బ్యూటీకి బన్నీని తొలిసారి కలిసినప్పుడే క్రష్‌ స్టార్ట్‌ అయిపోయిందట. ఆ విషయాన్ని ఓపెన్‌గా చెప్పేసింది. ఇటీవల విజయ్‌దేవరకొండ - ప్రియాంకా జవాల్కర్‌ జంటగా తెరకెక్కుతోన్న 'టాక్సీవాలా' చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి బన్నీ స్పెషల్‌ గెస్ట్‌గా హాజరయ్యాడు కదా. అప్పుడే ఈ బ్యూటీ చెప్పేసింది. అయితే మన స్టైలిష్‌ స్టార్‌ కూడా ఈ విషయాన్ని ఫన్నీగానే తీసుకున్నాడు. 

కాకపోతే.. సీరియస్‌గా తీసుకుంటే అక్కడ స్నేహారెడ్డి (బన్నీ భార్య) ఊరుకుంటుందా.? ఈ బ్యూటీకి తెలుగులో ఇదే తొలి చిత్రం. మరాఠీ బ్యూటీ. కానీ తెలుగులో చక్కగా మాట్లాడేస్తోంది. తెలుగు భాషపై ఉన్న అభిమానంతో తొలి సినిమాకే తెలుగులో మాట్లాడేస్తోంది. సినిమా ప్రమోషన్స్‌ నిమిత్తం ఇస్తున్న ఇంటర్వ్యూల్లో అమ్మడు తెలుగులో మాట్లాడుతున్న ముద్దు ముద్దు మాటలకు ఆడియన్స్‌తో పాటు, యాంకర్స్‌ కూడా అవాక్కవుతున్నారు మరి. 

సినిమాలో అమ్మడు బాగానే నటించినట్లు కనిపిస్తోంది ప్రచార చిత్రాలను బట్టి చూస్తుంటే. ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా హారర్‌ టచ్‌తో కూడిన లవ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. రాహుల్‌ సాంకృత్యన్‌ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS