సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ - లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ ల కలయికలో 1996లో వచ్చిన భారతీయుడు సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం శంకర్ భారతీయుడు సీక్వెల్ ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. మధ్యలో ఆగిపోయినా.. ఎట్టకేలకూ ఈ చిత్రం చిత్రీకరణ శర వేగంగా జరుగుతోంది. ముఖ్య తారాగణంతో పాటు కమల్ హాసన్ సైతం ప్రస్తుత షెడ్యూల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుత షెడ్యూల్ ముగియగానే తర్వాతి షూటింగ్ కోసం టీమ్ విదేశాలకు వెళతారని తెలుస్తోంది. కాజల్ కూడా ఆ షెడ్యూల్లో పాల్గొననుంది.
అయితే ఈ సినిమా షూటింగ్ లేట్ అవ్వడంతో టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ ఈ సినిమా నుండి తప్పుకున్నట్టు తెలిసింది. ఆమెది ఓ కీలక పాత్ర అట. అందుకే ఆమె పాత్రలో గ్యాంగ్ లీడర్ బ్యూటీ 'ప్రియాంకా అరుళ్ మోహన్' ను తీసుకున్నారని తెలుస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే షెడ్యూల్ లో ప్రియాంకా మోహన్ కూడా షూట్ లో పాల్గొంటుందట. కెరీర్ బిగినింగ్ లోనే 'భారతీయుడు 2' వంటి చిత్రం లో ఛాన్స్ రావడం అంటే ప్రియాంకకు ఇదొక బంపర్ ఆఫర్ అనే చెప్పుకోవాలి. ఇక కమల్ హాసన్ ఈ సినిమా కోసం బల్క్ డేట్లు ఇచ్చాడు. కాజల్ తో పాటు రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్ కూడా ఇందులో కీలక పాత్రల్లో నటించబోతున్నారు.