అశ్వినీదత్ ను కలిసిన కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి.

మరిన్ని వార్తలు

ప్రముఖ నిర్మాత, వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ ను ఇవాళ ఆయన కార్యాలయంలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కలుసుకున్నారు. మోదీ ప్రభుత్వం సాధించిన ఆర్టికల్ 370 విజయ కరదీపికను, మోదీ ప్రభుత్వం సాధించిన ప్రగతి నివేదికను అందజేశారు. కేంద్రమంత్రితోపాటు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ , ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి అశ్వినీదత్ ను కలిసారు. ఈ సందర్భంగా మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ , నిర్మాత ప్రియాంక దత్ ను అభినందించిన ప్రహ్లాద్ జోషి... 'మహానటి' చిత్ర గొప్పతనాన్ని అడిగి తెలుసుకున్నారు.

 

అశ్వినీదత్ నిర్మించిన 'జగదేకవీరుడు అతిలోక సుందరి' గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. 20 నిమిషాలపాటు సినిమాలు, మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలపై పరస్పరం చర్చించుకున్నారు. అశ్వీనీదత్ మాట్లాడుతూ..... ఈరోజు గొప్ప అవకాశం లభించింది. కేంద్ర మంత్రి వచ్చి నాగ్ అశ్విన్ , ప్రియాంకలను అభినందించారు. దేశం మొత్తం మోదీ పనితీరును ప్రశంసిస్తుంది. మోదీ తీసుకున్న 370 ఆర్టికల్ రద్దు నిర్ణయం మనకు గర్వకారణం. దేశం కోసం మోదీ ఇలాంటి మరెన్నో మంచి నిర్ణయాలు తీసుకోవాలి.

 

"మేం జీఎస్టీ విషయంలో సూచించిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి సహకరించారు. నేను తరుచూ వెళ్లే వారణాసిని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేశారు. కాశ్మీర్ ను స్వేచ్చ కలిపించి కాశ్వీర్ మనదని చాటారు అన్నాడు. "వాజ్ పాయ్ పాలనలో గొప్ప పరిపాలన చూశాం. మళ్లీ మోదీ హయాంలో చూస్తున్నాం. భారతంలో కాశ్మీర్ ఒకటని చాటిచెప్పారు. ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు కలగజేయాలి. మా నుంచి ప్రభుత్వానికి అన్ని రకాల సహకారాలుంటాయని ప్రహ్లాద్ జోషికి చెప్పాం. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై దృష్టి సారించాలని మోదీ ప్రభుత్వాన్ని కోరాను" అన్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS