బండ్ల గణేష్‌కి కరోనా పాజిటీవ్ అనే వార్త చిత్రసీమని హడలెత్తించింది. షూటింగులకు సిద్ధమవుతున్నవాళ్లు సైతం.. ఇప్పుడెందుకొచ్చిన గొడవ అనుకుని, డ్రాప్ అయ్యారు. అయితే తనకు కరోనా వచ్చిందన్న వార్తల్ని బండ్ల ఖండించలేదు. అలాగని తనకి కరోనా అని ఒప్పుకోలేదు. సైలెంట్ గా ఉన్నాడు. ఇప్పుడు మాత్రం తనకు కరోనా నెగిటీవ్ వచ్చిందన్న విషయాన్ని అధికారికంగా ధృవీకరించాడు. ట్విట్టర్లో ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు.
కరోనా పాజిటీవ్ వచ్చినప్పుడు ఆ విషయం ఎందుకు చెప్పలేదంటూ... ట్విట్టర్ లో బండ్ల గణేష్‌ని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. కరోనా బారీన పడి, పాజిటీవ్ నుంచి నెగిటీవ్ లోకి మారడం నిజంగా హర్షించదగిన విషయం. బండ్ల ఇప్పుడు సేఫ్ గా ఉన్నాడన్నది ఆనందకరమైన సంగతే. కానీ.. పాజిటీవ్ వచ్చిన్పపుడు - ఆ విషయాన్ని అభిమానులతో పంచుకుంటే బాగుండేది. సెలబ్రెటీల్లో చాలామందికి కరోనా సోకింది. అయినా వాళ్లు ఆ విషయాన్ని దాచలేదు. అభిమానులతో పంచుకున్నారు. కరోనాతో పోరాడగలమని సంకేతాలు పంపారు. బండ్ల కూడా అలా చేయాల్సింది. ఎనీ వే.. ఇప్పుడు బండ్ల కోలుకున్నాడు. అది పాజిటీవ్ న్యూసే.