ఈ నేల 21 నుంచి నటుడు నాగార్జున హోస్ట్ గా రానున్న బిగ్ బాస్ 3 యొక్క ప్రసారం ను నిలపాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్జం ను నేడు దాఖలు చేసారు సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి. ఒక సినిమా ను ఏలా సెన్సార్ చేయుచున్నారో అస్లీలత, డబల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్న ఈ బిగ్ బాస్ గేమ్ షో ని కూడా సెన్సార్ చేయాలని కోర్ట్ ను కోరారు. ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్(ibf) చట్టాలను అనుసరించి యువకులను, పిల్లలను చేడు మార్గంలో నడుచుటకు నాంది పలికే ఈ బిగ్ బాస్ ను ఖచ్చితంగా సెన్సార్ చేయుటకు i.b.f చర్యలు చేపట్టాలని, సెలెక్షన్స్ నేపథ్యంలో మహిళలను వేధింపులకు, కమిట్మెంట్ ల పేరుతో మానసిక వత్తిడికి గురిచేయుచున్న 'స్టార్ మా' యాజమాన్యం పై చట్ట పరమైన చర్యలను తీసుకోవాలని నిర్మాత కేతిరెడ్డి కోరారు.
ఈ కేస్ లో మొత్తం ప్రతివాదులుగా 10 మందిని చేర్చినారు, నటుడు నాగార్జున తో పాటు స్టార్ మా ibf, ఎండిమాల్,సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర హోమ్ సెక్రెటరీ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, సిటీ పోలీస్ కమిషనర్ లను పార్టీ లుగా చేర్చటం జరిగిందని, నేడు ఈ ప్రయోజన వాజ్జం ప్రధాన న్యాయమూర్తి లంచ్ మోషన్ సమయంలో వినుటకు సిద్ధం అయ్యారని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి హైకోర్టు వద్ద తెలిపారు. ఈ కేస్ కేతిరెడ్డి తరపున శాంతి భూషణ్ అనే న్యాయవాదీ విచారన జరిపారని కేతిరెడ్డి తరుపున తన వాదనలను వినిపించారు. వాదనలను విన్న ప్రధాన నాయమూర్తి కేస్ ను 23 జులై కి పోస్ట్ చేయడం జరిగింది.
కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఒక ప్రకటన లో 'బిగ్ బాస్ టీం సభ్యులు జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి నటి గాయత్రీ గుప్తా ల విషయం ను గ్రహించి వంచనకు గురి అయిన ఎందరో మహిళలకు బాసటగా ఉండే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నటుడు అక్కినేని నాగార్జున అన్నమయ్య, భక్త రామదాసు, షిర్డీసాయి మహాత్వం వంటి చిత్రాలలో నటించి ఇలాంటి షో లకు హోస్ట్ గా ఉండడం గమనార్హమని, మీలో ఎవ్వరు కోటీశ్వరుడు లాంటి మంచి ప్రోగ్రాం కు హోస్టుగా వుండి
ఇలాంటి ప్రోగ్రాం కు హోస్ట్ గా ఉండడం ఎంత వరకు కరెక్టటో వారే నిర్ణయించుకోవలని, గతంలో ఇదే షో ను విమర్శించిన నాగార్జున ఈ షోకే హోస్ట్ గా ఉండాలనుకోవటం తనకు ఆశ్చర్యం కలిగించిందని, ఎంత వరకు పరిపాటో ఆయనే నిర్ణయించుకోవలని ఈ బిగ్ బాస్ టి.వి కార్యక్రమం ఎక్కువ గా యువకులను, పిల్లలను ప్రభావితం చేస్తున్నది కాబట్టి ప్రస్తుతం ప్రతి రోజు రాత్రి 9.30నుండి 10 .30 వరకు ప్రసారం చేయుచున్నరు ఒక్క శని ఆదివారలలో ఈ కార్యక్రమం ను రాత్రి 9 నుండి 10 గంటల వరకు ప్రసారం చేయుచున్నారని. అన్ని రోజులలో ఈ కార్యక్రమం లేట్ నైట్ 11 గంటల పైన ప్రసారం చేస్తే బాగుంటుందని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆ ప్రకటన లో కోరారు.