పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లోకి రావాలన్న బలమైన నిర్ణయం తీసుకోవడం అభిమానులకు ఆనందాన్ని, ఉత్సాహాన్నీ అందించే విషయమే. అయితే పవన్ ఈ నిర్ణయం తనకు తాను ఇష్టపూర్వకంగా తీసుకున్నది కాదని, పవన్‌పై ఓ నిర్మాత తీవ్రంగా ఒత్తిడి తీసుకొస్తున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ నిర్మాత ఎవరో కాదు.. ఏ.ఎం.రత్నం. పవన్‌తో ఓ సినిమా చేయాలని రత్నం ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. ఇది వరకే పవన్‌కి అడ్వాన్సు ఇచ్చాడు.
అంతే కాదు.. పవన్ అడిగినప్పుడల్లా భారీగా డబ్బులు సమకూర్చి పెట్టాడు. జనసేన కోసం పవన్ ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టేశాడు కూడా. ఇప్పుడు ఆ డబ్బు తిరిగి ఇచ్చే పరిస్థితిలో పవన్ లేడు. మరోవైపు రత్నం కూడా తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వాలని, లేదంటే... సినిమా చేసి పెట్టాలని ఒత్తిడి తీసుకొస్తున్నాడని తెలుస్తోంది. అందుకే.. రత్నంకి సినిమా చేసేయాలని పవన్ డిసైడ్ అయ్యాడు. పవన్ తదుపరి చిత్రానికి నిర్మాత ఎ.ఎం.రత్నం అని టాక్ నడుస్తోంది. సో.. పవన్ సినిమాకి నిర్మాత ఖాయమైనట్టే.