'అర్జున్ రెడ్డి' సినిమాని వేరే భాషలో మీరే నటించాల్సి వస్తే చేస్తారా.? అని రౌడీ స్టార్ విజయ్ దేవరకొండను అడిగితే, 'ఖచ్చితంగా చేయను. ఒకే పాత్రలో రెండు సార్లు నటించడం నాకు నచ్చదు..' అని గతంలో మన రౌడీ సెలవిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడిలాంటి ప్రశ్నే రకుల్ ప్రీత్ సింగ్‌కి ఎదురైంది. అయితే, సమాధానం మాత్రం సేమ్ టు సేమ్ వచ్చింది. ఓ కార్యక్రమంలో రకుల్‌ని ఇదే ప్రశ్న అడిగితే, నిర్మొహమాటంగా నో అనేస్తానని రకుల్ చెప్పింది.
ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్‌కి తెలుగులో హవా తక్కువైనా, ఒకటీ అరా సినిమాలతో నెట్టుకొచ్చేస్తోంది. నితిన్ సరసన 'చదరంగం' సినిమాలో రకుల్ ప్రీత్ నటిస్తోంది. తమిళంలో ఓ రెండు ప్రాజెక్టులు, హిందీలో రెండు ప్రాజెక్టులతో ఓ మోస్తరు బిజీగానే గడుపుతోంది. తెలుగులో మరిన్ని అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. ఇదిలా ఉంటే, రకుల్ ప్రీత్ సింగ్ ఎదుర్కొన్నన్ని రూమర్స్ తెలుగులో మరో హీరోయిన్ ఎదుర్కోలేదని చెప్పొచ్చు. కానీ, వాటన్నింటినీ చాలా లైట్ తీసుకుంటూ, కెరీర్‌లో ముందుకు దూసుకెళ్లిపోతోంది రకుల్ ప్రీత్ సింగ్. హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తారా.? అని అడిగితే, నో అని చెప్పీ చెప్పనట్లుగా చెప్పేసింది రకుల్.
కారణం సంగతి పక్కన పెడితే, తాను చేసే కమర్షియల్ సినిమాల్లోనే తన పాత్రకు ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటాను.. తప్ప పూర్తి ప్రాధాన్యత ఉన్న పాత్రలో ఇప్పుడప్పుడే నటించనని రకుల్ చెప్పింది. ఇక నితిన్ సినిమాలో తన పాత్ర గురించి చెబుతూ, ఇంతవరకూ తాను పోషించని పవర్ ఫుల్ లాయర్ పాత్రనీ చెప్పుకొచ్చింది. ఖచ్చితంగా ఈ పాత్రతో మంచి పేరొస్తుందని నమ్మకం వ్యక్తం చేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్.