ప‌వ‌న్ టైటిల్ అదేనా..? అందులో నిజ‌మెంత‌?

By Gowthami - February 12, 2020 - 14:29 PM IST

మరిన్ని వార్తలు

ప‌వ‌న్ క‌ల్యాణ్ - క్రిష్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఏఎం ర‌త్నం నిర్మాత‌. క‌థానాయిక‌గా కైరా అద్వాణీ పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. ఈ సినిమా టైటిల్ కూడా ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. `విరూపాక్ష‌` అనే టైటిల్ పెట్టార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే.. ఇందులో ఏమాత్రం నిజం లేద‌ని తెలుస్తోంది. విరూపాక్ష‌ అంటే శివుడు అని అర్థం.

 

ఈ సినిమా కోసం క్రిష్ చాలా పేర్లు అనుకున్నాడ‌ట‌. అందులో విరూపాక్ష కూడా ఉంది. అయితే ఈ పేరు ఎవ‌రికీ అర్థం కాద‌ని, క‌థ‌లోని పాత్ర‌కూ సంబంధం ఉండ‌ద‌ని ముందే ప‌క్క‌న పెట్టేశార్ట‌. క్రిష్ ద‌గ్గ‌ర నాలుగైదు పేర్లు సిద్ధంగా ఉన్నాయ‌ని, వాటిలో ఒక‌దాన్ని త్వ‌ర‌లోనే ఫిక్స్ చేస్తార‌ని స‌మాచారం. అంటే... `విరూపాక్ష‌` టైటిల్ పెట్టే అవ‌కాశాలు ఏమాత్రం లేన‌ట్టే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS