ఒకప్పటి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఇప్పటి ఇండియన్ బ్యాడ్మింటన్ టీమ్ కోచ్ అయిన పుల్లెల గోపీచంద్ బయోపిక్ రాబోతోందన్న సంగతి తెలిసిందే. 2018లో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుంది. ఫాక్స్ స్టార్ స్టూడియో, అబుదాంతియా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లలో ఈ సినిమా రూపొందుతోంది. గతంలో బాలీవుడ్‌లో 'బేబీ', ఎయిర్ లిఫ్ట్' వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలు ఈ బ్యానర్స్‌లో రూపొందాయి. కాగా ఇప్పుడు ఈ బ్యానర్‌లోనే గోపీచంద్ బయోపిక్ రాబోతోంది. 'గరుడవేగ' సినిమాతో ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు.
తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా ఏకకాలంలో తెరకెక్కనుంది. సుధీర్ బాబు ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించనున్నాడు. ఎప్పటి నుండో ఈ సినిమాలో నటించాలని తహతహలాడుతున్నాడు సుధీర్‌బాబు. సుధీర్‌బాబు స్వతహాగా బ్యాడ్మింటన్ ప్లేయర్. అంతేకాదు గోపీచంద్ దగ్గరే కోచింగ్ తీసుకున్నాడు కూడా. తన గురువు బయోపిక్‌లో తాను నటించడం ఎంతో సంతోషంగా ఉందని గతంలో సుధీర్‌బాబు చెప్పారు. ఈ సినిమా తనకెంతో ప్రత్యేకమనీ ఆయన అన్నారు. ఇటీవలే 'శ్యమంతకమణి' సినిమాతో సుధీర్‌బాబు ఆకట్టుకున్నారు.
ఈ సినిమా కోసం ఫిట్‌నెస్‌లో కసరత్తులు చేస్తున్నాడు. అఫ్‌కోర్స్ ఆల్వేస్ సుధీర్‌బాబుది కండలు తిరిగిన బాడీ ఆయే. అయితే ఈ సినిమా కోసం ఇంకొంచెం కేర్ తీసుకుంటున్నాడట. మరో పక్క బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్ కూడా తెరక్కెబోతోంది. ఈ బయోపిక్‌లో ముద్దుగుమ్మ శ్రద్ధాకపూర్ నటిస్తోంది. ఈ బ్యూటీ కూడా సినిమా కోసం ప్రొఫిషనల్‌గా బ్యాడ్మింటన్ నేర్చేసుకుంటోంది. లేటెస్టుగా పి.వి.సింధు బయోపిక్ కూడా రానుంది. ఈ సినిమా వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.