బిగ్‌బాస్‌ పునర్నవి కెరీర్‌కి యూజ్‌ అవుతుందా?

మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌ ద్వారా ఫాలోయింగ్‌ సంపాదించుకున్న కౌషల్‌, టైటిల్‌ దక్కించుకుని, బయటికొచ్చాక కెరీర్‌లో చాలా బిజీ అవుతాడనుకున్నారంతా. కానీ, అలా ఏమీ జరగలేదు. నిజానికి అంతకు ముందే అక్కడక్కడా చిన్న చిన్న రోల్స్‌లో కనిపించిన కౌషల్‌, బిగ్‌బాస్‌ పేరు చెప్పి, ఆ తర్వాత ఒక్క సినిమాలోనూ కనిపించింది లేదు. బిగ్‌బాస్‌లో వచ్చిన ఫాలోయింగ్‌తో కౌషల్‌ని హీరోగా పెట్టి సినిమాలు తీసేందుకు నిర్మాతలు క్యూ కట్టేశారంటూ వార్తలు ప్రచారమయ్యాయి. కానీ, అవన్నీ గాలి వార్తలే అని తేలిపోయాయి.

 

బిగ్‌బాస్‌ ట్రాక్‌ రికార్డు చూసుకుంటే, ఈ షోలో పార్టిసిపేట్‌ చేసిన సెలబ్రిటీలెవ్వరికీ కెరీర్‌ పరంగా ఆ ఫాలోయింగ్‌ యూజ్‌ అయ్యింది లేదు. కానీ, తాజా బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ పునర్నవి భూపాళం మాత్రం అంతకు ముందే చాలా ప్రాజెక్టులు లైన్‌లో పెట్టి, బిగ్‌హౌస్‌లోకి అడుగు పెట్టింది. ఫాలోయింగ్‌ విషయానికి వస్తే, పునర్నవికి దక్కిన ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. గ్లామర్‌, ఆటిట్యూడ్‌, పర్‌ఫామెన్స్‌.. ఇలా అన్నింట్లోనూ హీరోయిన్‌గా తనదైన పర్‌ఫామెన్స్‌ చూపించింది పునర్నవి. పునర్నవి లేని హౌస్‌ చూడడం వేస్ట్‌ అని కొందరు వీక్షకులు డిసైడ్‌ అయిపోయారంటేనే ఆమె ఫాలోయింగ్‌ ఏ పాటిదో ఆర్ధం చేసుకోవాలి. ఇకపోతే, ప్రస్తుతం పునర్నవి నటిస్తున్న రెండు సినిమాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 'ఒక చిన్న విరామం' అనే టైటిల్‌తో ఓ సినిమా, 'సైకిల్‌' అనే మరో సినిమాలోనూ పునర్నవి నటిస్తోంది.

 

'సైకిల్‌' విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే ఫస్ట్‌లుక్‌ కూడా రిలీజైంది. త్వరలోనే 'ఒక చిన్న విరామం' కూడా ప్రేక్షకుల ముందుకు రానుందట. వీటితో పాటు, ఫ్యూచర్‌ ప్రాజెక్టులు చాలానే ఉన్నాయట. అసలు తన ప్రాజెక్ట్స్‌ ఒత్తిడి కారణంగానే పునర్నవి హౌస్‌ నుండి బయటికొచ్చేసిందనే టాక్‌ కూడా తాజాగా వినిపిస్తోంది. హౌస్‌ నుండి బయటికొచ్చి రెండు రోజులు కాకుండానే, అవకాశాల కోసం ఫోన్‌లు చేస్తున్నారట కొందరు నిర్మాతలు. చూడాలి మరి పునర్నవికి బిగ్‌బాస్‌ హెల్ప్‌ అవుతుందేమో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS