అక్టోబరు 2న విడుదలైన `సైరా - నరసింహారెడ్డి` బాక్సాఫీసు దగ్గర తన తఢాకా చూపిస్తున్నాడు. తొలి రోజే బాక్సు బద్దలు కొట్టి, తన స్టామినా చూపించిన చిరు - నాలుగో రోజు కూడా నిలకడైన వసూళ్లతో సైరాని ముందుకు తీసుకెళ్లాడు. నాలుగో రోజు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 7 కోట్ల వసూళ్లు సాధించింది. దాంతో సైరా - టోటల్ స్కోర్ 62 కోట్ల (షేర్) వరకూ చేరింది. ఆదివారం కూడా ఇదే జోరు కొనసాగే అవకాశాలున్నాయి.
ఇప్పటి వరకూ నైజాంలో 17.18 కోట్లు తెచ్చుకున్న సైరా.. ఇక్కడ నాన్ బాహుబలి రికార్డుల్ని బద్దలు కొట్టే అవకాశాన్ని సృష్టించుకుంది. సీడెడ్‌లో ఇప్పటికే 10.5 కోట్లు వచ్చేశాయి. ఈస్ట్, వెస్ట్, కృష్ణా, నెల్లూరులలో కూడా సైరాకి నిలకడైన వసూళ్లు దక్కుతున్నాయి. ఇప్పటికీ 50 శాతం థియేటర్లు నిండుతున్నాయి. దసరా సీజన్ ఈ సినిమాకి మరింతగా కలిసొచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు - చాణక్య ఫ్లాట్ టాక్ మూటగట్టుకోవడం సైరాకి ప్లస్ పాయింట్.